KalkiAD2829 : ప్రపంచ అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ లో కల్కి కి భారీ డిమాండ్.. ప్రభాస్ క్రేజ్ మామూలుగా లేదుగా..!

KalkiAD2829 : ప్రజెంట్ ప్రతి ఒక్కరి ధ్యాస కల్కి పైనే ఉంది. ఇప్పుడు భారతీయ సినిమా అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఏదన్నా ఉంది అంటే అది వన్ అండ్ ఓన్లీ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి అనే చెప్పుకోవచ్చు.

ఇక ఈ మూవీలో దీపిక పదుకొనే హీరోయిన్గా నటిస్తుండగా నాగ్‌ అశ్విన్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు సినిమా నుంచి మరో గర్వించదగ్గ మూవీ వస్తుంది అని టీజర్ తో ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ మూవీకి ఓవర్సీస్ మార్కెట్లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ చిత్రాన్ని భారీ ఎత్తున ఐమాక్స్ వెర్షన్ లో కూడా ప్రపంచ దేశాల్లో రిలీజ్ చేయనున్నారు.

అయితే ప్రపంచపు అతిపెద్ద ఐమాక్స్ స్క్రీన్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మెల్బోర్న్ ఐ మ్యాక్స్ లో భారీ డిమాండ్ ఏర్పడింది. ఆల్రెడీ అక్కడ షోస్ ప్లాన్ చేయగా.. అవన్నీ ఫెయిల్ అయిపోవడంతో అదనపు షోనీ తెలుగులో వేసినట్లుగా వారు తెలియజేశారు. ఇక దీంతో ప్రభాస్ సినిమాకి ఏ లెవెల్ లో డిమాండ్ ఉందో అర్థమవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు