David Warner turns Pushparaj : కొత్త యాడ్ కోసం పుష్ప అవతారంలో డేవిడ్ వార్నర్… పొరపాటు చేశావ్ అంటున్న నెటిజన్లు

David Warner turns Pushparaj : స్టార్ హీరోలకు డై హార్డ్ ఫాన్స్ ఉండడం సాధారణమైన విషయమే. కానీ ఒక స్టార్ మరో స్టార్ కు ఈ రేంజ్ లో అభిమాని అయితే ఎలా ఉంటుందో ఆసీస్ బ్యాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ నిరూపించి చూపించారు. పుష్ప మూవీ టైం నుంచి ఈ క్రికెటర్ తెగ పాపులర్ అవుతున్నాడు. తాజాగా ఓ కొత్త యాడ్ కోసం డేవిడ్ వార్నర్ పుష్ప రాజ్ అవతారంలో కనిపించాడు. ఆయనను అలా చూసిన బన్నీ అభిమానులు పొరపాటు చేశావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ డేవిడ్ వార్నర్ చేసిన ఆ పొరపాటు ఏంటో తెలుసుకుందాం పదండి.

శ్రీవల్లి పాటతో పాపులర్

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప ఎంతటి సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీలోని పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అయితే వీటన్నింటికంటే ఎక్కువగా వార్నర్ వైరల్ అయ్యాడు. ఇందులోని శ్రీవల్లి పాటకు డాన్స్ చేసిన డేవిడ్ వార్నర్ వీడియో అప్పట్లో తెగ వైరల్ కావడంతో ఆయన పాపులారిటీ విపరీతంగా పెరిగింది. అప్పట్నుంచి అతను పుష్పను అస్సలు వదలట్లేదు. పుష్పను పొగడడానికి, ఆయన అవతారంలో కనిపించడానికి, పాటలకు డాన్స్ చేయడానికి ఎలాంటి అవకాశం వచ్చినా సరే అస్సలు వదులుకోవట్లేదు. పైగా అల్లు అర్జున్ తో మంచి ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేస్తున్నాడు.

Warner Strong Warning As Pushpa Raj In A Commercial | cinejosh.com

- Advertisement -

కొత్త యాడ్ లో పుష్ప రాజ్ లా వార్నర్

ఇక ఇప్పటికే పలుమార్లు పుష్ప రాజ్ లా మారి ఆకట్టుకున్న డేవిడ్ వార్నర్ తాజాగా ఓ కొత్త యాడ్ లో పుష్పరాజ్ పాత్రలో దర్శనమిచ్చాడు. అచ్చం పుష్ప లాంటి దుస్తులను ధరించి, తగ్గేదేలే అనే మేనరిజంని ఫాలో అయ్యాడు. అలాగే వార్నర్ హిందీలో డైలాగ్ చెప్పాడు. ఒక కమర్షియల్ యాడ్ లో డేవిడ్ వార్నర్ పుష్ప రాజ్ లా కనిపించడం బన్నీ అభిమానులకు తెగ నచ్చేసింది. ప్రస్తుతం డేవిడ్ వార్నర్ చేసిన ఆ యాడ్ పోస్ట్ వైరల్ అవుతుండగ, దీనిపై అల్లు అర్జున్ తో పాటు ఆయన అభిమానులు కూడా స్పందిస్తున్నారు.

బన్నీ రియాక్షన్

ఈ ఉల్లాసకరమైన యాడ్ పై ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. కామెంట్ సెక్షన్ లో నవ్వులతో పాటు ఫైర్ అండ్ థంబ్స్ అప్ ఎమోజీలను షేర్ చేశారు. దానికి డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ హౌ ఫన్నీ ? యు ఆర్ ద లెజెండ్ అంటూ రాస్కొచ్చారు. ఇక వీళ్లిద్దరి చాట్ కు సంబంధించిన స్క్రీన్ షాట్లు వైరల్ అవుతుండగా, అల్లు అర్జున్ అభిమానులు డేవిడ్ వార్నర్ పుష్పను వదలకపోవడం చూసి రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మాత్రం నువ్వు పొరపాటున ఆస్ట్రేలియాలో పుట్టావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా పుష్ప రాజ్ వల్ల డేవిడ్ వార్నర్ క్రేజ్ రోజురోజుకూ మరింతగా పెరుగుతుంది అనేది మాత్రం నిజం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు