Balakrishna: యానిమల్ మూవీ సీన్ ని రిపీట్ చేసిన బాలయ్య – పురందేశ్వరి.. ఈ భావోద్వేగానికి ఫిదా అంటున్న ఫ్యాన్స్..!

Balakrishna: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నాల్గవసారి ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. దీంతో నారా అభిమానులు అండ్ కుటుంబ సభ్యుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ప్రమాణస్వీకారానికి ముందే ఆ వేడుకపై అత్మీయ అనుబంధాలు కనిపించాయి.

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేడుకలో యానిమల్ మూవీ సీన్ రిపీట్ అయింది. ప్రమాణ స్వీకారానికి ముందు నందమూరి బాలకృష్ణ, అందరూ చూస్తుండగానే తన చెల్లి అయినటువంటి పురందేశ్వరి పలకరిస్తూ తలపై నిమిరి.. నుదుటిపై ముద్దు పెడుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

దీంతో పురందేశ్వరి కూడా అన్న ప్రేమను ఆస్వాదిస్తూ నవ్వుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే యానిమల్ మూవీలో కూడా ఇలాంటి సీన్ ఒకటి ఉంది. హీరో చెల్లి కూర్చుని ఉంటే తన పక్కన కూర్చుని తలపై చేయి వేసి నుదుటిపై ముద్దు పెడతాడు. ఇక ఆ సీన్ నే ఇప్పుడు బాలయ్య అండ్ భువనేశ్వరి కూడా రిపీట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు