Ileana: ఇలియానాపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ డైరెక్టర్.. బలుపు అంటూ..?

Ileana.. ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా టాలీవుడ్లోకి దేవదాసు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. దాదాపు అందరి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. ముఖ్యంగా గ్లామర్ ఒలకబోయడంలో ఈమె తర్వాతే ఎవరైనా.. అంతలా తన అందచందాలతో యువతను ఆకట్టుకున్న ఈమె.. చివరిగా తెలుగులో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో నటించింది. ఈ సినిమా తర్వాత ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు ఈ గోవా అందం.. అంతేకాదు పెళ్లి చేసుకోకుండానే గర్భవతిని అయ్యాను అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన ఈమె.. ఏకంగా కొడుకుకు జన్మనిచ్చి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక ఇప్పటికీ తన కాబోయే భర్తను ఈమె పరిచయం చేసింది.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకపోవడం గమనార్హం..

ఇలియానా కి పొగరు ఎక్కువ…

ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే రకరకాల గ్లామర్ ఫోటోషూట్లతో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా ఒక మంచి కథ దొరికితే ఇటు టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికే కూడా సిద్ధంగా ఉంది ఇలియానా. ఇదిలా ఉండగా మరొకవైపు కృష్ణవంశీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇలియానాకి బాగా పొగరు అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.. ఇకపోతే కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రాఖీ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఇలియానా ,చార్మీ హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. మరి కృష్ణవంశీ ఉన్నట్టుండి స్టార్ హీరోయిన్ ఇలియానా పై ఎందుకు ఇలాంటి కామెంట్లు చేశారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి..

ఇలియానా పై కృష్ణవంశీ షాకింగ్ కామెంట్స్..

Ileana: The star director who made sensational comments on Ileana.. Balupu..?
Ileana: The star director who made sensational comments on Ileana.. Balupu..?

కృష్ణవంశీ మాట్లాడుతూ.. చార్మీ ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి నటిస్తుంది.. కానీ ఆమెకు అన్నీ ఫ్లాప్సే వస్తున్నాయి.. రాఖీ సినిమా సమయంలో ఇలియానా ఆటిట్యూడ్ నాకు ఏమాత్రం నచ్చలేదు.. ముఖ్యంగా ఆమెను నేను నా సినిమాలో తీసుకోవాలని అనుకోలేదు.. కానీ ఆ సమయంలో ఆమెకు మంచి కమర్షియల్ సినిమాలు వచ్చి పడ్డాయి.. దాంతో ఉన్నట్టుండి ఆమె క్రేజ్ కాస్త బాగా పెరిగిపోయింది.ఇక హీరోయిన్గా కొంతమంది బలవంతంగా ఈమెను పెట్టాలని సూచించడంతో.. ఇక ఆమెను తప్పనిసరి పరిస్థితిలో హీరోయిన్ గా తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. కానీ నాకు మాత్రం ఈమెని హీరోయిన్ గా పెట్టుకోవాలని అస్సలు లేదు.. ఇక ఆ సినిమా చేసే సమయంలో ఆమె చూపించే ఆటిట్యూడ్ నాకు ఇంకా కోపం తెప్పించేది.. ఆమెతో నేను సినిమా షూటింగ్లో జస్ట్ డైలాగ్స్ చెప్పేవాడిని కానీ ఆ తర్వాత ఆమెను అస్సలు పట్టించుకునే వాడిని కాదు.. ఇక ఆమె పొగరు చూస్తే ఎవరికైనా ఆమెతో ఉండాలని అనిపించదు అంటూ కృష్ణ వంశీ షాకింగ్ కామెంట్లు చేశారు.. ప్రస్తుతం ఈ కామెంట్లు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు