Thangalaan : ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్..

Thangalaan : కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారతదేశంలో ఉన్న విలక్షణమైన నటుల్లో విక్రమ్ ఒకరు. సినిమా కోసం పాత్ర కోసం ఎలాంటి రిస్క్ అయినా చేస్తాడు. అయితే గత విక్రమ్ కి చాలా ఏళ్లగా నిఖార్సైన హిట్ మాత్రం దక్కడం లేదు. రీసెంట్ గా పొన్నియిన్ సెల్వన్ హిట్ అయినా అది మల్టి స్టారర్ సినిమా కాబట్టి హిట్ క్రెడిట్ కూడా షేర్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా విక్రమ్ “తంగలాన్” అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. విక్రమ్ నటిస్తున్న ఈ తంగలాన్ (Thangalaan) సినిమా ఎన్నో రోజులు షూటింగ్ జరుపుకోగా, దాదాపు కొన్ని నెలల తరబడి వాయిదా పడుతూ వస్తుంది. ఎప్పుడో జనవరిలోనే రిలీజ్ అవుతుందన్న ఈ సినిమా షూటింగ్ డిలే వల్ల పోస్ట్ పోన్ అయింది. నిజానికి ఏడాది కిందే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా విక్రమ్ షూటింగ్ లో గాయపడడంతో వాయిదా పడగా, ఈ ఏడాది కూడా రకరకాల కారణాలతో వాయిదా పడుతుంది. తాజాగా ఈ సినిమాకి సంబంధించి కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.

Thangalaan Movie New Release Date Announcement

ఎట్టకేలకు కొత్త రిలీజ్ డేట్..

ఇక ముందుగా తంగలాన్ సినిమా 2024 జనవరి చివరి వారం అనుకుని ఆ మేరకు పోస్టర్ కూడా వదిలారు. కానీ సాధ్యపడలేదు. తర్వాత సమ్మర్ అనుకున్నారు. తీరా చూస్తే వేసవి సీజన్ కూడా అయిపోయింది. ఇక ఈ ఈ ఏడాది పోటీ వల్ల వచ్చే ఛాన్స్ లేదు అని అనుకుంటున్న తరుణంలో ఆశ్చర్యకరంగా లేటెస్ట్ గా తంగలాన్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసారు. కాసేపటికిందే రిలీజ్ చేసిన పోస్టర్ లో “తంగలాన్” సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోనూ వైరల్ అవుతుంది. ఎందుకంటే అదే రోజు పుష్ప ది రూల్ అవుతుంది.

- Advertisement -

పుష్ప తప్పుకుంటే, తంగలాన్ ఖచ్చితంగా వస్తాడు?

ఇక పుష్ప 2 స్వాతంత్ర దినోత్సవానికి రాదని భావించిన విక్రమ్ యొక్క తంగలాన్ మేకర్స్ చిత్రాన్ని ఆగస్ట్ 15 న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ పుష్ప 2 అదే డేట్ కి వస్తుందనే ఇక్కడ అభిమానులు నమ్మకంగా ఉన్నా, ఇంకా షూటింగ్ పార్ట్ బాకి ఉండడంతో వాయిదా చేసేఅవకాశం ఎక్కువగా ఉందని సామాచారం, ఇక ఆగస్ట్ 15న విడుదలయ్యే ఏ సినిమా అయినా లాంగ్ వీకెండ్‌లో లాభపడుతుంది. అంతేకాక మొదటి సోమవారం, అది కూడా రక్షా బంధన్ కారణంగా సెలవు. ఇక పుష్ప 2 తమిళంలో కూడా మంచి క్రేజ్ ను కలిగి ఉంది. ఒకవేళ పుష్ప2 గనుక వాయిదా పడితే, తంగలాన్ మేకర్స్ దాని విడుదల తేదీని రెండో ఆలోచన కూడా లేకుండా తీసుకోవాలని ఇష్టపడతారు. మరి ఏం జరుగుతుందో చూడాలి, ఇక తంగలాన్ చిత్రానికి పా. రంజిత్ దర్శకత్వం వహించగా, స్టూడియో గ్రీన్ వారు నిర్మించారు. ఇక KGF లాంటి ప్రాంతంలో జరిగిన కొన్ని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తంగలాన్ రూపొందించబడిందని సమాచారం. ఈ సినిమాలో మాళవిక మోహనన్ కథానాయికగా నటించడం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు