Namitha: ఆ విషయంలో డిప్రెషన్ కి గురయ్యా.. నమిత ఎమోషనల్..!

Namitha.. మోడల్ గా కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నమిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఒకప్పుడు తన అంద చందాలతో యువతను ఉర్రూతలూగించి ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత అనూహ్యంగా బరువు పెరిగిపోయి అందరిని ఆశ్చర్యపరిచింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం వంటి భాషల్లో పలు సినిమాలు చేసి బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే 2017లో నటుడు వీరేంద్ర చౌదరిని పెళ్లి చేసుకున్న ఈమె సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.. ఇక 2020లో మాయా సినిమా తర్వాత పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైంది.. ఇటీవలే ఇద్దరూ కవల పిల్లలకు జన్మనిచ్చి వారి ఆలనా పాలన చూసుకుంటూ ఇంటికే పరిమితమైంది నమిత..

ప్రెగ్నెన్సీ విషయంలో ఎమోషనల్ అయిన నమిత..

Namitha: Did you get depressed about that.. Namitha is emotional..!
Namitha: Did you get depressed about that.. Namitha is emotional..!

అయితే అనూహ్యంగా ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నమిత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఎమోషనల్ కామెంట్లు చేసింది. . 2017లో పెళ్లి జరిగితే 2021 లో మొదటిసారి ప్రెగ్నెంట్ అయ్యాను.. ఈ విషయాన్ని మా వాళ్లతో చాలా సంతోషంగా పంచుకున్నాను.. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు…నాలుగో నెలలోనే గర్భ స్రావం అయి బాధ భరించలేక డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను.. ఇక నా భర్త వల్లే ఆ బాధ నుంచి బయటకు వచ్చాను.. మళ్లీ ప్రెగ్నెంట్ అయ్యాను. మూడో నెలకే ట్విన్స్ అని తెలియడంతో పూర్తిగా బెడ్ కే పరిమితమయ్యాను.. అప్పుడు నా భర్త నాకు పలు ఆంక్షలు పెట్టేవాడు.. అయితే బెడ్ రెస్ట్ తీసుకున్నప్పటికీ కూడా పొట్ట కనిపించలేదు.. దీంతో చాలా భయపడిపోయాను.. ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు.. ఎంతో టెన్షన్ పడ్డాను.. కానీ 7 నెలల తర్వాత నాకు కడుపు పెరిగింది. దీంతో ఊపిరి పీల్చుకున్నాను.. ఇప్పుడు ఇద్దరు కవల పిల్లలు పుట్టి.. నా జీవితంలోకి వెలుగులు తీసుకొచ్చారు అంటూ చెప్పుకొచ్చింది నమిత మొత్తానికైతే నమిత చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

నమిత జీవిత విశేషాలు..

ఇక నమిత విషయానికి వస్తే.. ఈమె అసలు పేరు నమిత ముఖేశ్ వాంక్వాలా.. 1980 మే 10న గుజరాత్ రాష్ట్రం.. సూరత్ లో జన్మించింది. మోడల్గా కెరియర్ మొదలుపెట్టిన ఈమె 1998లో మిస్ సూరత్ గా.. 2001లో మిస్ ఇండియా పోటీల్లో నాలుగవ స్థానం సంపాదించింది.. ఇక జెమినీ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నమిత.. ఆ తర్వాత సొంతం, ఒక రాజు ఒక రాణి, ఓ రాధా ఇద్దరు కృష్ణుల పెళ్లి వంటి చిత్రాలలో నటించడమే కాదు ఆ తర్వాత తమిళ్, కన్నడ, హిందీ సినిమాలలో నటించింది. ఇక బరువు పెరిగిపోయి 2010లో వచ్చిన సింహ చిత్రంతో అందరిని ఆశ్చర్యపరచడమే కాదు తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో విశేషంగా ఆకట్టుకుంది కూడా. ఇక కెరియర్ పీక్స్ లో ఉండగానే 2017లో నటుడు వ్యాపారవేత్త అయిన వీరేంద్ర చౌదరిని వివాహం చేసుకున్న ఈమె 2022 ఆగస్టు 19న ఇద్దరు మగ కవల పిల్లలకు జన్మనిచ్చింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు