Prithviraj Arrest : పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్..కారణం..?

Prithviraj Arrest : టాలీవుడు స్టార్‌ కమెడీయన్‌ పృథ్వీరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 30 ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అనే డైలాగ్ తో ఇతడు ప్రతి ఒక్కరికి దగ్గరయ్యాడు. కొన్ని వందల చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పృథ్వీరాజ్ ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. ఇదిలా ఉండగా….తాజాగా పృథ్వీరాజ్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. పృథ్వీరాజ్ గతంలో అతడి భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి మనోవర్తి చెల్లించాలంటూ అతనిపై విజయవాడలోని ఫ్యామిలీ కోర్టులో కేసు వేసింది.

భార్య బలిరెడ్డి శ్రీలక్ష్మికి పృధ్విరాజ్ నెలకు రూ. 8 లక్షలు చెల్లించాలని గతంలో ఆదేశాలు ఇచ్చింది ఫ్యామిలీ కోర్టు. అయితే ఈ ఆదేశాలను ఏమాత్రం పాటించని పృథ్వీరాజ్ హైకోర్టులో సవాలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయస్థానం తాత్కాలిక ఉపశమనం కల్పిస్తూ నెలకు రూ. 22 వేల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు వరకు ఉన్న బకాయిలు అన్ని చెల్లించాలని స్పష్టం చేసింది.

- Advertisement -

అయితే పృథ్విరాజ్ హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం పాటించలేదు. దీంతో అక్కడి భార్య శ్రీలక్ష్మి ఆమె న్యాయవాదులు సప్ప రమేష్, సిహెచ్ వడ్డీ కాసులు, సుంకర రాజేంద్రప్రసాద్ లను సంప్రదించి ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే పృథ్విరాజ్ కోర్టుకు హాజరు కావాల్సి ఉండగా…. వాటిని లెక్క చేయకుండా కేసు వివరాలను ఒక దినపత్రికలో ప్రకటన చేశారని, కోర్టుకు హాజరు కావడం లేదని లాయర్లు పిటిషన్ లో వెల్లడించారు. దీంతో ఫ్యామిలీ కోర్టు జడ్జి బుధవారం రోజున పిటిషన్ ను పరిశీలించారు. పృథ్వీరాజ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు