Ajith Remuneration: ఒక్కసారిగా రూ.100 కోట్లు పెంచిన హీరో.!

Ajith Remuneration.. సాధారణంగా ఏ హీరో అయినా సరే.. తాను నటించిన ఒక సినిమా విజయం సాధించింది అంటే ఆయన రెమ్యునరేషన్ లో… ఇంకో రూ .10 లేదా రూ .15 కోట్ల రూపాయల వరకు పెరుగుతుంది అనవచ్చు .. కానీ ఇక్కడ ఒక హీరో మాత్రం ఏకంగా రూ .100 కోట్లకు పైగా పెంచేసి అందరినీ ఆశ్చర్యపరచడమే కాదు ఇండియన్ సినీ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా రికార్డ్ సృష్టించారు మరి ఆయన ఎవరో కాదు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్.. ప్రస్తుతం అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరిగా అజిత్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు..

ఏకంగా రూ.100 కోట్లకు పైగా పెంచేసిన హీరో..

Ajith Remuneration: The hero who raised Rs. 100 crores in one go.!
Ajith Remuneration: The hero who raised Rs. 100 crores in one go.!

అసలు విషయంలోకెళితే అజిత్ మొన్నటి వరకు రూ.70 నుంచి రూ.80 కోట్లు మాత్రమే రెమ్యునరేషన్ తీసుకునేవారు.. ఇక చివరిగా వచ్చిన తునివు మూవీ కోసం కూడా రూ.70 కోట్ల వరకూ తీసుకున్నారు. అయితే ఇక్కడ అందర్నీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ..తాజాగా ఆయన నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా కోసం ఏకంగా రూ .101 కోట్లు పెంచేసి.. ఈ సినిమా కోసం రూ .171 కోట్లు తీసుకుంటున్నట్లు సమాచారం. ఏది ఏమైనా ఒక్క సినిమా కోసం ఈ రేంజ్ లో పారితోషకం అంటే నిజంగా ఆశ్చర్యకరమైన విషయమనే చెప్పాలి. ఇకపోతే ఈ పారితోషకం తమిళంలో రజనీకాంత్ , కమల్ హాసన్, విజయ్ దళపతి తర్వాత అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా అజిత్ రికార్డు సృష్టించారు. ఇక ఈ రేంజ్ లో సినిమా హీరోలు పారితోషకం పెంచుతున్నారంటే ఇక బడ్జెట్ అంతకుమించి పెరుగుతుంది అనడంలో సందేహం లేదు.. మొత్తానికి అయితే పారితోషకం పెంచేసి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు అజిత్.

అజిత్ కెరియర్..

అజిత్ విషయానికి వస్తే.. దక్షిణాది నటుడు అయిన ఈయన.. తెలంగాణలోని సికింద్రాబాద్లో జన్మించారు.. తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకం తో కెరియర్ ను మొదలుపెట్టిన అజిత్.. ప్రముఖ నటి శాలినీని 2000వ సంవత్సరంలో వివాహం చేసుకున్నాడు. చదివింది పదవ తరగతి వరకు అయినా అన్ని భాషలను అనర్గళంగా మాట్లాడగలరు.. ముఖ్యంగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ భాషలను అనర్గళంగా మాట్లాడగలరు కూడా.

- Advertisement -

దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్ గా స్థానం..

ఇకపోతే నాలుగు పదుల వయసు దాటి.. జుట్టు మొత్తం తెల్లబడిపోయినా.. ఏమాత్రం రంగు వేసుకోకుండా నేచురల్ హీరో గానే పాత్రలు పోషిస్తూ ఉంటాడు.. అయినా సరే అజిత్ కి ప్రేక్షకుల నుంచి అదే స్థాయిలో ఆదరణ లభిస్తోంది. మూడుసార్లు ఫిలిం ఫేర్ బెస్ట్ అవార్డులను అందుకున్న అజిత్ దేశంలోనే అత్యుత్తమ డ్రైవర్లలో ఒకరిగా నిలిచారు.. 2004 బ్రిటిష్ ఫార్ములా 3 సీజన్లో ఫార్ములా టు రేసింగ్ డ్రైవర్ గా పాల్గొన్నారు.. ఇక దేశంలో అత్యుత్తమ డ్రైవర్లలో మూడో స్థానం సొంతం చేసుకున్నారు. రేసింగ్ లో పాల్గొనాలని ముందు బైక్ మెకానిక్గా జీవితం ఆరంభించిన ఈయనకు ఒకసారి ప్రమాదం జరగడంతో ఆ తర్వాత పలు వ్యాపార ఏజెన్సీలు ఆయనను మోడలింగ్ చేయాల్సిందిగా కోరాయట.. ఇక తర్వాత దర్శకుల దృష్టిలో పడ్డ ఈయన 1992లో ప్రేమ పుస్తకం అనే సినిమాతో తొలి హీరోగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోగా కొనసాగుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు