RGV on Darshan Case : దర్శన్ పై ఆర్జీవీ సెటైర్… మూవీ స్టైల్ లో పంచులు

RGV on Darshan Case : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాలతో వార్తల్లో ఉంటాడన్న విషయం తెలిసిందే. వైరల్ అయ్యే సమస్యలపై తన అభిప్రాయాన్ని కుండబద్ధలు కొట్టినట్టుగా తెలియజేసే ఆర్జీవీ తాజాగా దర్శన్ కేసు గురించి మాట్లాడాడు. దర్శన్‌పై హత్య ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన అభిమానులు మాత్రం ఇంకా తమ హీరోకే సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ రామ్ గోపాల్ వర్మ సమాధానమిచ్చారు. తాజాగా ఆయన చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

దర్శన్ పై ఆర్జీవి సెటైర్లు

రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌ అరెస్ట్‌ అయ్యారు. అతనితో పాటు పవిత్రను కూడా అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపినందుకు రేణుకా స్వామిపై దాడి చేసి హత్య చేశారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ నడుస్తున్న నేపథ్యంలో ఆర్జీవీ దర్శన్ కేసు గురించి వరుస ట్వీట్స్ చేశారు.

మొదటి ట్వీట్ లో “దర్శకుడు స్క్రిప్ట్ రాసుకున్న తర్వాతే సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తాడు. చాలా సందర్భాల్లో దర్శకుడు సెట్ లోనే స్క్రిప్ట్ కూడా రాసుకుంటాడు. కానీ దర్శన్ విషయానికొస్తే సినిమా విడుదలయ్యాక స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు” అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. హత్య చేసిన దర్శన్ కేసులో ఇరుక్కోవడంతో, దాన్నుంచి తప్పించుకునేందుకు కొత్త కథ చెబుతున్నాడని ఆర్జీవీ అన్నారు.

- Advertisement -

Latest English News, Today's News, Today's headlines | Asianet Newsఇదొక రోగం…

రేణుక స్వామి దర్శన్ అభిమాని అన్నవిషయం తెలిసిందే. ఈ విషయం గురించి కూడా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఒక స్టార్ నటుడు తన డైహార్డ్ ఫ్యాన్‌ని ఉపయోగించి మరొక డైహార్డ్ అభిమానిని చంపడం స్టార్ ఐడలైజేషన్ వింత సిండ్రోమ్‌కు విచిత్రమైన ఉదాహరణ అని ఆర్జీవి ట్వీట్ చేశాడు. ఒక సెలబ్రిటీ వ్యక్తిగత జీవితంలోకి అభిమాని ప్రవేశించడం వల్ల కలిగే ప్రభావం గురించి కూడా మాట్లాడుతూ వారు ఆరాధించే నటుడు, నటి ఎలా జీవించాలో చెప్పడం కూడా అటువంటి సిండ్రోమే అని అన్నారు.

నిజానికి రేణుకా స్వామి కూడా దర్శన్ అభిమానుల్లో ఒకడిగా ఉండాలని కోరుకున్నాడు. అయితే తన అభిమాన హీరో పవిత్రకు బదులు భార్య అయిన విజయలక్ష్మితో ఉండాలి అనుకున్నాడు. ఈ కారణంగా పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపాడు. దీంతో అతడి ప్రాణం పోయింది.

దర్శన్ పై రౌడీ షీట్ ?

హత్య కేసులో నిందితుడైన నటుడు దర్శన్‌ తూగుదీపపై రౌడీషీట్‌ తెరవాలనే చర్చ సాగుతోంది. దర్శన్, దర్శన్ సామాజిక వ్యక్తిత్వం తదితర విషయాలపై గతంలో దాఖలైన కేసులను పరిగణనలోకి తీసుకుని రౌడీషీట్ తెరవాలన్న డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర్ స్వయంగా చెప్పారు. దీంతో ఒక వ్యక్తిపై రౌడీషీట్ తెరవాలంటే పోలీసులు అనుసరించాల్సిన ప్రమాణాలేమిటి? రౌడీషీట్ తెరిస్తే దర్శన్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఏదేమైనా దర్శన్ చేసిన ఒక అనాలోచిత పని వలన నిండు ప్రాణం పోవడమే కాకుండా ఒక కుటుంబం రోడ్డున పడింది. ఆ లోటు ఎవ్వరూ తీర్చలేనిది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు