Disha Patani First Look: రాక్సీని పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ విడుదల

Disha Patani First Look: టాలీవుడ్‌ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈశ్వర్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో ప్రభాస్… ఆ తర్వాత స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. బాహుబలి లాంటి సినిమా చేసి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు ప్రభాస్. అయితే ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ad సినిమా ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీగా ఉంది.

ఇలాంటి నేపథ్యంలో కల్కి సినిమా నుంచి వరుసగా అప్డేట్లు వస్తున్నాయి. తాజాగా కల్కి సినిమా నుంచి… దిశా పటాని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇవాళ హీరోయిన్ దిశాపటాని బర్త్డే అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బర్త్డే గిఫ్ట్ ఆమెకు ఇస్తూ…. చిత్ర బృందం ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. దిశాపటాని క్యారెక్టర్ పేరు రాక్సీ అని పరిచయం ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ క్రేజీ పోస్టర్ లో దిశాపటాని గోడకి ఆనుకొని తన నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. ఇక ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kalki 2898 AD: First look poster for Disha Patani is finally unveiled | Latest Telugu cinema news | Movie reviews | OTT Updates, OTT

- Advertisement -

కాగా… నాగ అశ్విన్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తోంది. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా తీశారు. అంతేకాదు ఈ సినిమాలో బాలీవుడ్ నటీనటులు, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వారు కూడా నటిస్తున్నారట. దీంతో ఈ సినిమా ట్రెండింగ్ లో ఉంది. కాగా మొన్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. కాక ఈ నెల 27వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు