Akhil Akkineni: మాస్ లుక్ తో ఎట్రాక్ట్ చేస్తున్న అఖిల్..!

Akhil Akkineni Spotted with Dramatic New Look: టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న ప్రత్యేకత అంతా కాదు. నందమూరి కుటుంబం తర్వాత అక్కినేని కుటుంబానికి… ఇండస్ట్రీలో మంచి వాల్యూ ఇస్తారు. అయితే అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటికే స్టార్ హీరోలు చాలా మంది వచ్చారు. అలాంటి వారిలో అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని అక్కినేని ఒకడు. అప్పుడప్పుడు సిసింద్రీ సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా వచ్చిన అఖిల్… ఆ తర్వాత… మనం సినిమాలో అతిధి పాత్ర చేశాడు.

ఇక 2017లో అఖిల్ సినిమాతో ఇండస్ట్రీలో హీరోగా అడుగు పెట్టాడు అక్కినేని అఖిల్. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఏజెంట్ లాంటి సినిమాలు చేసి… సక్సెస్ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఇప్పటివరకు అక్కినేని నాగార్జున కొడుకు అఖిల్ పెద్ద హిట్ కొట్టలేకపోయాడు. ఇటీవల 2023 సంవత్సరంలో తీసిన ఏజెంట్… భారీ డిజాస్టర్ గా మారిపోయింది.

Akhil Akkineni Spotted with Dramatic New Look

ఇది ఇలా ఉండగా తాజాగా అక్కినేని అఖిల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అఖిల్ ఎయిర్ పోర్ట్ కు వెళ్తుండగా అక్కడ ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వీడియో కాస్త క్షణాల్లో వైరల్ గా మారింది. అందులో అక్కినేని హీరో అఖిల్… పొడవాటి జుట్టుతో కనిపించాడు. సిక్స్ ప్యాక్ చేసి కాస్త లావుగా మారినట్లు కనిపిస్తోంది. అసలు అక్కినేని అఖిల్ లాగా కనిపించకుండా… డిఫరెంట్ లుక్ లో ఉన్నాడు అఖిల్. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌…మనోడు కొత్త ప్రాజెక్ట్‌ కోసం ఇలా దర్శనం ఇచ్చాడు అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు