Mega Family: త్వరలోనే మెగా హీరో పెళ్లి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి కారణంగా.. ఆ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొని… ఇండస్ట్రీ లోకి చాలా మంది హీరోలు వచ్చారు. రామ్ చరణ్ నుంచి… వైష్ణవ తేజ్ వరకు చాలామంది హీరోలు వచ్చి సక్సెస్ అయ్యారు. ఇంకా ఆ మెగా కుటుంబం నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు.

అయితే… మెగా మేన అల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన వారిలో సాయి ధరంతేజ్ ఒకడు. 2014 సంవత్సరంలో పిల్ల నువ్వు లేని జీవితం అంటూ… ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తన మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న సాయి ధరంతేజ్… ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పోలికలు సాయి ధరంతేజ్ కు ఉన్న నేపథ్యంలో… ఆయనకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగింది.

sai dharam tej

లేటెస్ట్ గా విరూపాక్ష సినిమాతో బంపర్ హిట్ అందుకున్న సాయి ధరమ్ తేజ్…ఫూచర్‌ పై దృష్టి పెట్టాడు. అంతేకాదు.. అతి త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట. ఈ మేరకు మెగా కుటుంబ సభ్యులు… పెళ్లి చూపులు కూడా ప్రారంభించేశారట. మంచి సంబంధం వస్తే.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేయాలని అనుకుంటున్నారట. తాజా సమాచారం ప్రకారం.. ఏపీకి చెందిన ఓ వ్యాపార వేత్త కూతురితో సాయి ధరమ్ తేజ్…పెళ్లి ఫిక్స్‌ అయ్యే చాన్సులు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే క్లారిటీ వచ్చే చాన్స్‌ ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు