Samantha: మలయాళంలోకి సమంత ఎంట్రీ?

Samantha’s entry into Malayalam: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ సినిమా అనంతరం వరసగా సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్ లో అగ్ర హీరోయిన్గా రాణిస్తోంది. దాదాపు ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 14 సంవత్సరాల కు పైనే అవుతుంది.

అయినప్పటికీ ఏమాత్రం తరగని అందంతో సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడు తెలుగులో పెద్దగా సినిమాలు చేయడం లేదు. తన పూర్తి ధ్యాస అంతా బాలీవుడ్ ఇండస్ట్రీపైనే పెట్టింది. బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తోది. సినిమాల్లోనే కాకుండా పలు వెబ్ సిరీస్ లలోను నటిస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటుంది.

Samantha Latest photoshoots viral on social media

- Advertisement -

స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని అందిపుచ్చుకుంటుంది. తాజాగా సమంతకు సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ తాజాగా మాలివుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మమ్ముట్టి సరసన ఆమె హీరోయిన్గా నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో పోలీస్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసుకుంటూ రాణిస్తోంది సమంత. ఈ బ్యూటీ ఇప్పటివరకు మలయాళంలో ఒక్క సినిమా కూడా చేయలేదు. సమంత ఎలాంటి లాంగ్వేజ్ లోనైనా సరే తన అద్భుతమైన నటనతో సినిమాను హైలైట్ చేస్తోందని సమంత అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా టాలీవుడ్ హీరోయిన్‌ సమంత…నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ హీరోయిన్‌ సమంత, చైతూ వివాహం 2017 లో జరుగగా…2021 లో విడిపోయారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు