Renu Desai: రేణు దేశాయ్ కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. హ్యాపీ అంటూ పోస్ట్..!

Renu Desai: ప్రెసెంట్ సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండవ భార్య రేణు దేశాయ్ ఓ రేంజ్ లో యాక్టివ్ గా ఉంటున్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. మరీ ముఖ్యంగా పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి పవన్ అండ్ అఖీరా, ఆద్యలకు సంబంధించి వరస పోస్ట్లు పెడుతూ వస్తుంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి అఖీరా తన నాన్నతోనే ఉన్నాడు.

దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చంద్రబాబును కలిసిన సమయంలో ఢిల్లీ వెళ్లి మోడీని కలిసిన సమయంలో పవన్ వెంట అఖీరా ఉన్నాడు. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి కూడా మెగా ఫ్యామిలీతో కలిసి అఖీరా అండ్ ఆద్య వెళ్లారు. అయితే తన నాన్న ప్రమాణ స్వీకారంలో అకిరా మోడీకి తన చెల్లి ఆధ్యాను పరిచయం చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫోటోలను రేణు దేశాయ్ పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేసింది. ” నేను బిజెపికి పెద్ద ఫ్యాన్.

Pawan Kalyan fulfilled Renu Desai's wish
Pawan Kalyan fulfilled Renu Desai’s wish

నా పిల్లలు తన తండ్రి ద్వారా బిజెపి ప్రధాని మోడీని కలుసుకోవడం అమ్మగా నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. వాళ్ల నాన్న ద్వారా నా కోరిక తీరింది. అకిరా వాళ్ల నాన్నతో మోడీని కలిసినప్పుడు ఆధ్యా వాళ్లతో వెళ్లలేక పోయింది. ఆరోజే పాఠశాల ప్రారంభం కావడంతో వెళ్లడం సాధ్యం కాలేదు. కానీ నిన్న వాళ్ళ నాన్న ఫంక్షన్ లో అకిరా.. ఆద్యను ప్రధాని మోడీకి పరిచయం చేశాడు. ఇప్పుడు నేను ఫుల్ హ్యాపీ గా ఉన్న ” అంటూ తన ట్వీట్లో పేర్కొంది రేణు దేశాయ్. ప్రెసెంట్ రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు