Priyanka Chopra : ప్రియాంక భర్త నిక్ జోనాస్ సోదరుడికి క్యాన్సర్… వీడియో ద్వారా షాకింగ్ విషయాన్ని చెప్పిన కెవిన్

Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనాస్ బ్రదర్ కెవిన్ జోనాస్ తనకు క్యాన్సర్ అంటూ షేర్ చేసిన ఓ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. మరీ ఇప్పుడు కెవిన్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.

కెవిన్ కు చర్మ క్యాన్సర్

ప్రియాంక చోప్రా హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్ ను పెళ్ళాడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ భర్త నిక్, కూతురు మాల్టీతో విదేశాల్లోనే సెటిల్ అయ్యింది. అయితే నిక్ కు సోదరులు ఉన్నారు. వాళ్ళు కూడా ఆయన మ్యూజిక్ బ్యాండ్ లో భాగమే. వారిలో ఒకరైన నిక్ సోదరుడు కెవిన్ జోనాస్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక వీడియోను పంచుకున్నారు. దీని ద్వారా తాను చర్మ క్యాన్సర్‌తో బాధపడుతున్నానని, ఇటీవలే ఆపరేషన్ చేయించుకున్నానని వెల్లడించారు. అంతేకాకుండా స్కిన్ క్యాన్సర్ లక్షణాల గురించి వివరిస్తూ, జాగ్రత్తగా ఉండాలని ఆయన తన అభిమానులను హెచ్చరించాడు.

కెవిన్ జోనాస్ ఎవరు?

కెవిన్ జోనాస్ ప్రఖ్యాత పాప్-రాక్ బ్యాండ్ జోనాస్ బ్రదర్స్ లో ప్రధాన గిటారిస్ట్, సింగర్. ఆయనకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా కెవిన్ తన అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఖాతా (@kevinjonas)లో చర్మ క్యాన్సర్ గురించి ఒక పోస్ట్‌ను పంచుకున్నాడు. ఇప్పుడు ఆ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో షేర్ చేసిన ఒక్క రోజులోనే 10 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వీడియోలో కెవిన్ తనకు చర్మ క్యాన్సర్ ఉందని, ట్రీట్మెంట్ తర్వాత పూర్తిగా నయమైందని పేర్కొన్నాడు. అంతే కాకుండా స్కిన్ క్యాన్సర్ లక్షణాలను పట్టించుకోకుండా ఉండొద్దని అభిమానులను రిక్వెస్ట్ చేశారు.

- Advertisement -

Priyanka Chopra Brother-In-Law Kevin Jonas Diagnosed With Skin Cancer, Undergoes Treatment - Watch

చర్మ క్యాన్సర్ అంటే ఏమిటి ?

క్యాన్సర్ అంటే అందరికీ తెలుసు. కానీ అందులోనూ సెపరేట్ గా రోగాలు ఉంటాయనే విషయంమే చాలామందికి తెలియదు. అసలు ఈ చర్మ క్యాన్సర్ అంటే ఏంటి ? అంటే.. పొక్కు, పుట్టుమచ్చ లేదా చర్మం రంగులో మార్పు వంటి లక్షణాలు కన్పిస్తే అది క్యాన్సర్ కాకపోయినా ఇగ్నోర్ చేయడం మంచిది కాదు. ఇలాంటి లక్షణాలు కన్పిస్తే తరువాత అది క్యాన్సర్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి డాక్టర్ లను సంప్రదించడం మంచిది. త్వరగా చికిత్స మొదలు పెడితే ఎంత పెద్ద జబ్బు అయినా తగ్గిపోతుంది.

చర్మ క్యాన్సర్ లక్షణాలు

చర్మంపై కొత్త పుట్టుమచ్చ రావడం కన్పిస్తే అది చర్మ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ముఖ్యంగా 30 సంవత్సరాల వయస్సు తర్వాత ఇది స్త్రీలలో కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తుంది. మెలనోమాగా పిలుచుకునే ఈ వ్యాధి తరువాత ప్రమాదంగా మారే అవకాశం ఉంది. మెలనోమా అనేది ఒక రకమైన చర్మ క్యాన్సర్. స్కిన్ కేన్సర్ ను ప్రాథమిక దశలో గుర్తిస్తే సులువుగా చికిత్స చేసి నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ ప్రకారం మోల్ పరిమాణం, ఆకారం లేదా రంగులో మారడం మెలనోమాకు సంకేతం. ఇది చర్మ క్యాన్సర్ స్టార్టింగ్ రూపం.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు