Nitin: టాలీవుడ్ హీరోలలో ఒకరైన నితిన్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ వెంకీ డైరెక్షన్లో రూపొందుతున్న తాజా చిత్రం రాబిన్ హుడ్. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ప్రచార చిత్రాలకి ఇప్పటికే మంచి ఆదరణ లభించింది. ఇక ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని మేకర్స్ విడుదల చేశారు.
రేపు ఉదయం 11:07 గంటలకి బాస్ లేడీ కి సంబంధించిన అప్డేట్ రానుంది. ఈ మూవీలో హీరోయిన్ రోల్పై నేడు క్లారిటీ రానుంది. ఇక ఈ చిత్రాన్ని డిసెంబర్ 20..2024 నా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
ఇక తాజాగా రిలీజ్ చేసిన సరికొత్త పోస్టర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ అండ్ వై రవి చందర్ లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీకి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈ మూవీపై నితిన్ అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు నెలకున్నాయి.