Pradeep Vijayan : ఇండస్ట్రీలో మరో విషాదం… నటుడు ప్రదీప్ విజయన్ మృతి

Pradeep Vijayan : ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది ప్రముఖ నటీనటులు వివిధ కారణాల వల్ల మరణించారు. అయితే తాజాగా సౌత్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన నటుడు ప్రదీప్ విజయన్ మృతి చెందారు.

ప్రదీప్ ఎప్పుడు మరణించాడో తెలియదు కానీ… జాతీయ మీడియాలో ప్రదీప్ మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. తన ఇంట్లో… ప్రదీప్ డెడ్ బాడీని… పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. ప్రదీప్ స్నేహితుడు… రెండు రోజులుగా ఫోన్ చేసినా కూడా… అతను లిఫ్ట్ చేయలేదట. దీంతో చెన్నైలో ప్రదీప్ ఉంటున్న ఇంటికి… అతని ఫ్రెండ్ వెళ్లాడట.

- Advertisement -

ఎంత డోర్ కొట్టిన… ప్రదీప్ డోర్ తీయకపోవడంతో…. వెంటనే పోలీసులకు ఫిర్యాదు ఇచ్చాడు ప్రదీప్ స్నేహితుడు. అయితే ఈ తరుణంలోనే పోలీసులు… ప్రదీప్ డెడ్ బాడీని గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రదీప్ ది సాధారణ మరణమా? లేక ఆత్మహత్యానా ? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇక ఈ కోలీవుడ్ యువ నటుడు చనిపోయి రెండు రోజులు అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా…తమిళ ఇండస్ట్రీలో పప్పుగా పరిచయమైన… విజయన్ 2013లో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఇక లేటెస్ట్ గా విజయ్ సేతుపతి చేసిన మహారాజా సినిమాలో నటించాడు విజయన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు