OTT Movie : ఈ బీచ్ కి వెళ్తే తిరిగిరారు… వీక్ హార్ట్ ఉన్నవారు ఈ మూవీని చూడొద్దు

OTT Movie : బీచ్ అంటే ఇష్టం లేదు అని చెప్పే వారెవరూ ఉండరు. వచ్చిపోయే అలల శబ్దంతో అందంగా, ప్రశాంతంగా ఉండే బీచ్ ఒడ్డున సేద తీరాలని కలలు కనే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ ఆ బీచ్ ప్రాణాలు తీసే భయంకరమైన ప్రాంతం అయితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడం కష్టమే అయినప్పటికీ అదే నిజమైతే ఒళ్ళు జలదరిస్తుంది. వెన్నులో వణుకు పుట్టించే ఇలాంటి స్టోరీ లైన్ తోనే ఓ మూవీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ మూవీ పేరేంటి? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? అనే వివరాల్లోకి వెళితే…

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్…

ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న మూవీ దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఈ మూవీ పేరు ఓల్డ్. సినిమాకి పేరుకి పెద్దగా సంబంధం లేకపోయినా కంటెంట్ మాత్రం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ బీచ్ కి వెళ్తే వయసు పెరిగిపోతుంది. ఇప్పటిదాకా బీచ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలను చూసాం. కానీ ఇది ఒక డిఫరెంట్ కంటెంట్ ఉన్న థ్రిల్లర్ మూవీ. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను చూడాలి అనుకునే వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్. మరి ఈ మూవీ స్టోరీ ఏంటో ఓ లుక్కేద్దాం పదండి.

Old (2021) - IMDb

- Advertisement -

కథలోకి వెళ్తే…

సినిమాలో ముందుగా ఒక అందమైన ఫ్యామిలీని చూపిస్తారు. అందులో గయ్, ప్రిస్క అనే ఇద్దరు భార్యాభర్తలు. వాళ్లకి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఆ పిల్లల పేరు ట్రెంట్, మాడెక్స్. అందరూ కలిసి ఓ హాలిడే ట్రిప్ ని ప్లాన్ చేస్తారు. అలా హాలిడే కు వెళ్లిన ఈ ఫ్యామిలీ తాము బస చేసిన రిసార్ట్ కు దగ్గర్లో ఓ బీచ్ ఉందని తెలుసుకుంటారు. ఇంకేముంది ఫ్యామిలీతో చక్కగా ఎంజాయ్ చేయడానికి బీచ్ కంటే మంచి ప్లేస్ ఏముంటుంది? వాళ్లు కూడా ఇదే ఫీలయ్యి కుటుంబంతో కలిసి అక్కడికి వెళ్లాలనుకుంటారు. ఈ క్రమంలోనే మరో రెండు కుటుంబాలతో కలిసి బీచ్ కి వెళ్తారు ఆ గయ్ ఫ్యామిలీ.

అయితే వెళ్ళగానే ట్రెంట్ కు ఆ బీచ్ లో ఓ డెడ్ బాడీ కనిపించడంతో భయపడిపోతాడు. ఆ తర్వాత సడన్ గా అక్కడికి మిడ్ అనే వ్యక్తి వచ్చి అది తన ఫ్రెండ్ డెడ్ బాడీ అని చెప్తాడు. ఇక బీచ్ కు వచ్చిన వారిలో డాక్టర్ అయిన చార్లీ అనే వ్యక్తికి మిడ్ పై అనుమానం వస్తుంది. మరోవైపు అంతలోనే చార్లీ తల్లి చనిపోతుంది. ట్రెంట్, మాడెక్స్ ఇద్దరూ ఊహించని విధంగా ఏజ్ పెరిగి పెద్దవాళ్ళు అయిపోతారు. అసలు ఈ వింత సంఘటనలన్నీ ఎందుకు జరుగుతున్నాయో అక్కడున్న ఒక్కరికి కూడా అర్థం కాదు. చివరకు ఇదంతా బీచ్ వల్లే జరుగుతుందని అర్థం చేసుకొని అక్కడ్నుంచి పారిపోవాలని ప్రయత్నం మొదలుపెడతారు. మరి ఈ బీచ్ నుంచి ఎవరైనా బయటపడగలిగారా? ఎలా తప్పించుకున్నారు? అ బీచ్ లో ఇదంతా ఎందుకు జరుగుతుంది? అనే విషయాలు తెలియాలంటే ఓల్డ్ మూవీని చూడాల్సిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు