Nani : నేచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ ‘దసరా’, ‘హాయ్ నాన్న’ వంటి చిత్రాలతో నాని బ్లాక్ బస్టర్లు అందుకున్న విషయం తెలిసిందే. ఒక మాస్ సినిమా, ఒక క్లాస్ సినిమా తో కలిసి రెండు సార్లు మంచి హిట్లు అందుకున్న నాని, ఈ సారి క్లాస్ మాస్ కలగలిపి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నాడు. ఇక ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కుతుంది. అంటే సుందరానికి సినిమా తర్వాత ఈ కాంబోలో సినిమా తెరకెక్కుతోందని తెలిసిందే. దీంతో ఈ మూవీపై ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఫస్ట్ లుక్ మొదలుకొని ఈ మూవీ నుంచి వస్తున్న అప్డేట్స్ కూడా అంచనాలు పెంచేస్తోన్నాయి. ఈ క్రమంలో సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌కు ముహుర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. జూన్ 15న ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహుర్తం ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్.
కిక్కెక్కిస్తున్న గరం గరం ప్రోమో…
ఇక ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్‌కి మరో ఇంకా రెండు రోజులు ఉందనగా.. తాజాగా ప్రోమో సాంగ్ రిలీజ్ చేశారు. “గరం గరం యముడయో” అంటూ సాగే ఈ పాట ఆకట్టుకుంటుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్, లిరిక్స్ గూస్బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. జేక్స్ బిజోయ్ అందించిన సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ మ్యూజికల్ ఆడియోకు మరింత ప్లస్ అయ్యేలా ఉందనిపిస్తుంది. ఇక ఫుల్ సాంగ్ కోసం జూన్ 15 వరకు వేచి చూడాల్సిందే. శనివారం ఉ.11 గంటలకు ఫుల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు ఈ సందర్భంగా వెల్లడిచింది చిత్ర యూనిట్. ఇదిలా ఉంటే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.
భారీ అంచనాలతో సరిపోదా శనివారం..
ఇక జూన్ నెలాఖరు వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుందని సమాచారం. ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో క్లైమాక్స్ సన్నివేశాలతో పాటు పలు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారట. ఇదిలా ఉంటే ఈ సినిమా నాని (Nani) సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుండగా.. ఎస్జే సూర్య, సాయికుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.కాగా ఈ సాంగ్ ప్రోమో చూస్తుంటే ఇది హీరో నాని క్యారెక్టరైజేషన్‌ని తెలియజేసేలా ఉందనిపిస్తోంది. పవర్‌పుల్ సాగిన ఈ పాట గూస్బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక సరిపోదా శనివారం లో నాని శనివారం మాత్రమే తన కోపం చూపించే డిఫరెంట్ కాన్సెప్ట్ లో నటిస్తున్నాడు. ఇక రిలీజ్ చేస్తున్న ప్రోమోలు, టీజర్ లు, ఇప్పుడు రాబోతున్న సాంగ్ కూడా శనివారం మాత్రమే రిలీజ్ అయ్యేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. శనివారం వచ్చేలా చిత్ర యూనిట్ ప్రమోషన్లు ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆడియన్స్ మైండ్ లో సరిపోదా శనివారం సినిమాని సెట్ చేయడానికి మేకర్స్ ఇలా భిన్నంగా ఆలోచిస్తున్నారు .