Baby Varnika: సన్నాఫ్ సత్యమూర్తి మూవీలో ఉన్న ఈ పాపను గుర్తుపట్టారా… అల్లు అర్జున్ పాటకి మాస్ స్టెప్స్..!

Baby Varnika.. సాధారణంగా చైల్డ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా కొంతమంది చైల్డ్ ఆర్టిస్ట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎందుకంటే వీరికి పెద్దగా నటనలో అనుభవం లేకపోయినప్పటికీ.. హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకొని.. జనాల్లో పాతుకుపోతూ ఉంటారు.. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులు వరుస సినిమాలతో బిజీగా కనిపించేవారు.. కానీ ఈమధ్య కాలంలో ఎక్కువ మంది పెద్దగా కనిపించడం లేదు. ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరమవుతున్నారు. ఇక అలాంటి వారిలో బేబీ వర్ణిక కూడా ఒకరు. సన్నాఫ్ సత్యమూర్తి సినిమా అనగానే వెంటనే గుర్తొచ్చేస్తుంది ఈ చిన్నారి.. ఈ సినిమాలో తన అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరిని ఆకట్టుకుంది. ఇక అప్పుడు ఈ సినిమాలో నటించి మెప్పించిన వర్ణిక ఇప్పుడు చూస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యపోతారు. పైగా అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గి రవ్వ పాటకు మాస్ స్టెప్ వేసి అందరినీ ఆకట్టుకుంది.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారింది.

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాతో వెలుగులోకి

Baby Varnika: Do you remember this baby from the Sannaf Satyamurthy movie... Mass steps to Allu Arjun's song..!
Baby Varnika: Do you remember this baby from the Sannaf Satyamurthy movie… Mass steps to Allu Arjun’s song..!

త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన రెండవ సినిమా సన్నాఫ్ సత్యమూర్తి.. అప్పట్లో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ కలెక్షన్లు వసూలు చేసింది. మాస్ ప్రేక్షకులతో పాటు ఆడియన్స్ ని కూడా విపరీతంగా ఆకట్టుకున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ నటించిన విధానం అలాగే ఉపేంద్ర నటన రెండూ కూడా హైలెట్ గా నిలిచాయి. దీనికి తోడు ఇందులో అల్లు అర్జున్ అన్న కూతురిగా బన్నీ పక్కనే కనిపించిన చిన్నారి వర్ణిక కూడా సినిమాకి హైలెట్ అయింది. ఈ సినిమాలో చిన్నారి క్యారెక్టర్ కోసం కొంతమంది పిల్లలకు త్రివిక్రమ్ ఆడిషన్స్ నిర్వహించగా.. అందులో కొంతమంది మాత్రమే ఫైనల్ లిస్టుకు చేరుకున్నారు.. ఫైనల్ గా ఒక ఐదు మందిలో ఎవరో ఒకరిని ఫిక్స్ చేసుకోవాలని అనుకోగా ఆ సమయంలో అనుకోకుండా తన అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా త్రివిక్రమ్ ఒక చిన్నారి ఫోటో చూశాడట. ఆ పాప చాలా క్యూట్గా అనిపించడంతో ఇంకో ఆలోచన చేయకుండా ఆమెనే తీసుకోవాలని ఫిక్స్ అయ్యారట త్రివిక్రమ్.

చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్..

అయితే ఈ సినిమా షూటింగ్స్ లాంటివి అలవాటు లేదు అని వర్ణిక తల్లిదండ్రులు కంగారు పడ్డారట.. పాప ఎలా నటిస్తుందో అని కూడా వాళ్ళు కొంత ఆందోళన పడినట్లు ఉండడంతో దర్శకుడు త్రివిక్రమ్ ప్రత్యేకంగా మాట్లాడి కొన్ని రోజులపాటు చిన్నారి వర్ణికను చిత్ర యూనిట్ సభ్యులతో కొంత టైం స్పెండ్ చేసే విధంగా ఏర్పాటు చేశారట.. ముఖ్యంగా అల్లు అర్జున్ అప్పుడప్పుడు వర్ణికను కలుస్తూ స్నేహపూర్వకంగా మార్చేసుకున్నారు.. దీంతో షూటింగ్లో పెద్దగా ఇబ్బంది కలగలేదని సమాచారం. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో అలాగే నాన్నకు ప్రేమతో సినిమాలో రకుల్ చిన్నప్పటి పాత్రలో నటించింది .ఇక తర్వాత సినిమాలలో నటించలేదు తర్వాత మళ్లీ ఇలా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది వర్ణిక.

- Advertisement -

బన్నీ పాటకి మాస్ స్టెప్స్..

ఇక తాజాగా పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గి రవ్వ లాగ ఉంటాడే నా స్వామి అనే పాటకు మాస్ స్టెప్ వేసి ఇరగదీసింది వర్ణిక. మొత్తానికి అయితే చాలా అందంగా టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతుందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు