Mahesh Babu: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ వారసత్వాన్ని అందుపుచ్చుకుంటూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబుకి ఏ విధమైన గుర్తింపు ఉందో మన అందరికీ తెలిసిందే. తన లుక్ అండ్ స్టైల్ కి ప్రత్యేకమైన ఆర్మీ ఏ ఉందని చెప్పుకోవచ్చు. వయసు మీద పడుతున్నప్పటికీ గ్లామర్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు మహేష్.
ఇక మహేష్ పోలికలు తన కొడుకు గౌతమ్ కి రాకపోయినప్పటికీ తన మేనల్లుడికి మాత్రం దిట్టో దిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సుధీర్ బాబు కొడుకు చరిత్ మానస్ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి. ఇక తాజాగా సుధీర్ బాబు లేటెస్ట్ గా నటించిన హరోం హర మూవీ చూసేందుకు థియేటర్ కి వెళ్ళాడు చరిత్.
నడిచే స్టైల్… లుక్ Same to Same మేనమవయ్యే 👌#Charith pic.twitter.com/6B4FNo44uL
— Rajesh Manne (@rajeshmanne1) June 14, 2024
ఈ క్రమంలోనే తన రీసెంట్ లుక్ అండ్ స్టైలిష్ వాక్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అచ్చం మేనమామ లాగానే నడుస్తూ మహేష్ ని డామినేట్ చేశాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా..” ఈ పోలికలు గౌతం కి వచ్చి ఉంటే వేరే లెవెల్ ఉండేది.. ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.