Jr. NTR: తాత మీద ఫైర్ అయిన ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..?

Jr. NTR.. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా చివరికి చేరుకున్న విషయం తెలిసిందే.. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేసి.. ఆ తర్వాత దేవర సీక్వెల్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే..

జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఇష్టమే..

ఇక తాతకు తగ్గ మనవడిగా రాణిస్తున్న ఎన్టీఆర్ కి సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా చాలామంది అభిమానులు అయ్యారు. ఇటీవలే స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా తనకు నచ్చిన హీరో ఎవరు అంటే వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పేశాడు.. అంతలా పేరు తెచ్చుకున్నాడు ఎన్టీఆర్… అభిమానులు అంటే ఎన్టీఆర్ కు చాలా ఇష్టం.. అలాగే ఆయన అంటే వారికి అమితమైన ప్రేమ.. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేయకముందు కూడా ఇతర దేశాలలో ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఆయన నటనకు, డాన్స్ కు వంక పెట్టేవారూ కూడా ఎవరూ లేరు. ఎంత కష్టమైన స్టెప్ అయినా సరే అవలీలగా చేసేస్తాడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా సరే ఇట్టే చెప్పేస్తాడు.. అందుకే తాతకు తగ్గ మనవడు అంటూ పేరు సొంతం చేసుకున్నారు..

సీనియర్ ఎన్టీఆర్ పై కోప్పడ్డ జూనియర్ ఎన్టీఆర్..

Jr. NTR: What happened to NTR who fired at his grandfather?
Jr. NTR: What happened to NTR who fired at his grandfather?

ఇదిలా ఉండగా ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మా తాత మీద కోపం వచ్చిందని తెలిపాడు ఎన్టీఆర్.. అంతే కాదు ఈ విషయాన్ని చెబుతూ ఎమోషనల్ కూడా అయ్యాడు.. ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఒకసారి మా అమ్మను, నన్ను మా తాత రమ్మన్నారు.. అప్పుడు ఆయన చెప్పిన మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను.. మా అమ్మతో మాట్లాడుతూ.. ఇంతకాలం దూరంగా ఉన్నాము.. దాని గురించి ఇక పట్టించుకోకండి… నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు.. నా అంతటి వాడిగా తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు.. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అన్నారు.. తర్వాత ఆయన చనిపోయారు .. నాకు కోపం వచ్చింది.. ఈయన ఏంటి ఇంత మాట అన్నాడు.. నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను అని వదిలేసి వెళ్లిపోయాడు.. అనాధగా మళ్లీ వదిలేశాడు.. అప్పుడే నాకు ఒక దిక్కు వచ్చిందనే ధైర్యం.. ఇంతలోనే అనాధగా వదిలి వెళ్ళిపోవడం ఏంటి అనుకునేవాడిని.. కానీ ఇప్పుడు వయసు పెరిగిన తర్వాత అర్థమవుతుంది… మూడు అక్షరాలు ఇచ్చాడు “ఎన్టీఆర్”.. ఆయన పోలికలు ఇచ్చాడు.. అంతకంటే కావాల్సిందేముంది ఆయన ఆశీర్వాదం.. ఆయన వంతు బాధ్యత ఆయన నిర్వర్తించారు.. ఇక మా అమ్మ వంతు ఆమె కూడా తన బాధ్యత నిర్వర్తించింది. ఇప్పుడు నేను నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అంటూ ఎమోషనల్ అయ్యారు జూనియర్ ఎన్టీఆర్.. మొత్తానికి అయితే ఎన్టీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు