Singham Again: సింగం అగైన్ రిలీజ్ గురించి క్లారిటీ ఇచ్చిన అజయ్ దేవగన్

Singham Again: అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్, కరీనా కపూర్, రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, టైగర్ ష్రాఫ్ మరియు అర్జున్ కపూర్ కీలక పాత్రల్లో నటించిన భారీ మల్టీస్టారర్ సింగం ఎగైన్. ఈ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌కి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను మొదట ఆగస్టు 15, 2024న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఈ సినిమా ఆగస్టు 15వ తారీఖున వస్తుంది అని గ్యారెంటీ లేదు.

Singham Again

ఇక అజయ్ దేవగన్ నటించిన ఔరోన్ మే కహన్ దమ్ థా వచ్చే నెలలో విడుదల అవ్వబోతుంది. ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ నిన్న రిలీజ్ చేశారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో, అజయ్ దేవగన్‌ని అగైన్ సింగం గురించి మాట్లాడమని అడిగారు. ఆయన మాట్లాడుతూ, “సింగం అగైన్ విడుదల తేదీ గురించి నాకు ఖచ్చితంగా తెలియదు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, ఇంకా కొన్ని పార్ట్ లు షూట్ చేయాల్సి ఉంది. మేము ఏ హడావిడిలో లేము. హడావుడిగా పనులు చేస్తే క్వాలిటీ దెబ్బతింటుంది. సినిమా అవుట్ పుట్ బాగుంది అనిపించినప్పుడే సినిమాను విడుదల చేస్తాం” అన్నారు.

- Advertisement -

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప 2: ది రూల్ ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రెండు పాటలు కూడా రిలీజ్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగస్టు 15 కి ఈ సినిమా రిలీజ్ చేసే పనిలో ఉంది చిత్ర యూనిట్. అలానే అక్షయ్ కుమార్ ఖేల్ ఖేల్ మే మరియు జాన్ అబ్రహం వేదా సినిమా కూడా ఆగస్టు 15 న బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఢీకొననున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు