Rashmika : ఈ సమాజంలో చాలామంది గొప్ప పురుషులు ఉన్నారు

Rashmika : ఛలో సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది రష్మిక మందన. అయితే తక్కువ టైంలోనే ఎన్నో సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకుంది. పరశురాం దర్శకత్వంలో వచ్చిన గీత గోవిందం సినిమా మంచి గుర్తింపును తీసుకొచ్చింది. ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి స్టార్ హీరోల సరసన కూడా నటించే ఛాన్సులు పొందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో శ్రీవల్లి అనే పాత్రలో కనిపించింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా బీభత్సమైన వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సాధించుకుంది.

Rashmika Mandanna

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు సందీప్ రెడ్డి. మొదటి సినిమాతోనే దర్శకుడుగా తన మార్క్ ఏంటో చూపించాడు. ఆ తర్వాత బాలీవుడ్ లో అదే సినిమాను రీమేక్ గా చేశాడు. ఇక రీసెంట్ గా సందీప్ రెడ్డి దర్శకత్వం వహించిన సినిమా అనిమల్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. సినిమాలో రష్మిక పాత్రకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ తనకు పెళ్లయి పిల్లలు ఉన్నా కూడా వేరే అమ్మాయితో ఒక సందర్భంలో అఫైర్ పెట్టుకుంటాడు. దీనికి కథకి సంబంధం ఉంటుంది. అయితే రీసెంట్ గా సోషల్ మీడియా వేదిక ఒక అమ్మాయి ఇదే మీడియం షేర్ చేస్తూ అబ్బాయిల్ని నమ్మకూడదు అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

- Advertisement -

పురుషుల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు

అయితే ఆ వీడియోకి రష్మిక మందన స్పందించింది. మీరు చేసిన పోస్టులు నేను చిన్న కరెక్షన్ చేస్తున్నాను. పిచ్చి వ్యక్తులను నమ్మడం అనేది చాలా భయం. అలానే ఈ సమాజంలో చాలా మంది మంచి పురుషులు కూడా ఉన్నారు. అలాంటి వారిని నమ్మడం అనేది స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు