Sunny Leone : బాలీవుడ్ హాట్ బాంబ్ సన్నీ లియోన్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. తాజాగా ఓ కేరళ యూనివర్సిటీ ఆమెకు షాక్ ఇవ్వడంతో మరోసారి సన్నీ పేరు తెరపైకి వచ్చింది. యూనివర్సిటీలో ఆమె డ్యాన్స్ షోను రద్దు చేశారు యాజమాన్యం. మరి సన్నీ షోకు సన్నాహాలు మొదలయ్యాక ఎందుకు వెనక్కి తగ్గారు? అనే వివరాల్లోకి వెళ్తే..
సన్నీ షో క్యాన్సిల్
జూలై 5న కేరళలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ క్యాంపస్‌లో సన్నీ లియోన్ డ్యాన్స్ షో జరగాల్సి ఉంది. ఈ షోకు సంబంధించిన సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. అయితే ఈ డ్యాన్స్ షోకి ఒక్కసారిగా ఉన్నట్టుండి యూనివర్సిటీ అనుమతి నిరాకరించారు. కాలేజీ క్యాంపస్‌లో సన్నీ షో నిర్వహించబోమని స్పష్టం చేశారు. అయితే యూనివర్సిటీ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయంతో సడన్ గా విద్యార్థులు షాక్ కు గురయ్యారు. అయితే వాళ్ళ వాళ్ళ మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సన్నీ క్రేజ్ ఎలా ఉంటుందో తెలుసు కదా. ఆమె డ్యాన్స్ షోను ఏర్పాటు చేస్తే ఏవైనా అనుకోని సంఘటనలు ఏర్పడి విద్యార్థులకు ఇబ్బందులు ఎదురవ్వకూడదు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహనన్ కునుమల్ సన్నీ షోకు అనుమతి నిరాకరించారు. ఇటీవల తిరువనంతపురం ఇంజనీరింగ్ కళాశాల కుషాట్ లో జరిగిన యూనియన్ కార్యక్రమాల సందర్భంగా జరిగిన తొక్కేసలాట, మరణాలు జరిగాయి. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం క్యాంపస్‌లలో డీజే పార్టీలు, మ్యూజిక్ నైట్ లు మొదలైన వాటిపై నిషేధం విధించింది. ఇలాంటి ఆర్డర్ ఉన్నప్పటికీ వర్సిటీ అనుమతి లేకుండానే యూనివర్సిటీ కళాశాల యూనియన్ డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. క్యాంపస్ లోపల, వెలుపల యూనియన్ పేరుతో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించమని వీసీ తెలిపారు.
గతంలోనే తొక్కిసలాట, ప్రాణ నష్టం…
గత ఏడాది నవంబర్‌లో కేరళలోని ఎర్నాకులం జిల్లాలోని కొచ్చిన్ యూనివర్శిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సమయంలో రద్దీ విపరీతంగా పెరగడంతో తొక్కిసలాట జరిగింది. అంతే కాదు ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 60 మందికి పైగా విద్యార్థులు గాయపడ్డారు.ఈ నేపథ్యంలోనే తాజాగా మాతృభూమి కార్యక్రమాల జాబితాలో సన్నీ డ్యాన్స్ షోను చేర్చకూడదని నిర్ణయించారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
పోర్న్ స్టార్ నుంచి మోస్ట్ వాంటెడ్ స్టార్..
సన్నీలియోన్‌కి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమె బిగ్ బాస్ ద్వారా ఇండియాలో తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బిగ్ బాస్ హౌస్‌లో ఉండగానే సన్నీ లియోన్‌కి బాలీవుడ్ చిత్రం ఆఫర్ వచ్చింది. అప్పటి నుంచి సన్నీలియోన్ కెరీర్లో వెనుదిరిగి చూసుకోలేదు. సన్నీలియోన్ చాలా సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం ఆమెకు సినిమాల ద్వారా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. సన్నీ లియోన్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన అభిమానుల కోసం ప్రత్యేక ఫోటోలు, వీడియోలను పంచుకుంటుంది.