ROBINHOOD: శ్రీలీల గ్లింప్స్‌ అదుర్స్‌..దుమ్ములేపిందిగా

ROBINHOOD – Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు చేరువయ్యాడు. ఎప్పటికప్పుడు ఏదో ఒక సినిమాతో నితిన్ తన అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. ఈ క్రమంలోనే తాజాగా నితిన్ – వెంకీ కుడుముల కాంబినేషన్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం “రాబిన్ హుడ్”.

ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ నిర్మిస్తుండగా…. జీవి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో “భీష్మ” చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ హిట్ అయింది. దీంతో మరోసారి వీరిద్దరి కాంబినేషన్లో “రాబిన్ హుడ్” అనే సినిమా రాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే “భీష్మ” సినిమాలో నితిన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ అద్భుతంగా ఉందని వెంకీ మరోసారి తాను తీయబోయే సినిమాలో రష్మికను హీరోయిన్గా అనుకున్నారట.

- Advertisement -

కానీ రష్మిక డేట్స్ కుదరకపోవడంతో ఆ ప్రాజెక్టు నుంచి రష్మిక తప్పకుందట. ఆ తర్వాత ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపించింది. దానికి తగినట్టుగానే ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలను అనౌన్స్ చేస్తూ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. శ్రీ లీల పుట్టినరోజు సందర్భంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సినిమాలో శ్రీ లీల రిచ్ అమ్మాయి లాగా కనిపించింది. ఇందులో శ్రీ లీల నటన అద్భుతంగా ఉందని టాక్. ఇక ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు