Namrata Shirodkar: టాలీవుడ్ ఇండస్ట్రీలో వయసు మీద పడినప్పటికీ ఇంకా జస్ట్ 25 ఏళ్ల కుర్రాడి లాగా కనిపించే హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు అనే చెప్పుకోవచ్చు. కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తూ ప్రజెంట్ కూడా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడు ఈ హీరో.
ఇక ప్రస్తుతం తన వారసత్వాన్ని తన కూతురు అండ్ కొడుకుకి కూడా అందించే ప్రయత్నం చేస్తున్నాడు మహేష్. ఇక మహేష్ కొడుకు గౌతమ్ పెద్దగా సోషల్ మీడియాకి దగ్గరలో ఉండడు. కానీ కూతురు సితార మాత్రం ఇప్పటికే మంచి గుర్తింపును సంపాదించుకుంది. కొడుకు గౌతమ్ మాత్రం స్టడీస్ పై ఫోకస్ పెడుతూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.
View this post on Instagram
ఇక తాజాగా మహేష్ భార్య అండ్ హీరోయిన్ నమ్రత తన కొడుకుకు సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది. ఎన్నడూ లేని విధంగా తన తండ్రిలాగా నిత్యం యవ్వనంగా ఉండేందుకు గౌతమ్ కసరత్తులు మొదలుపెట్టాడు. గౌతమ్ జిమ్లో కష్టపడుతున్న ఇన్సిడెంట్స్ ని నమ్రత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రజెంట్ ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుండగా.. బాబు బాగానే కష్టపడుతున్నాడుగా.. అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు.