Cinema Industry : సెలబ్రిటీలకు కమాండోలు, పోలీసులతో విఐపి భద్రత… ప్రభుత్వానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

Cinema Industry : సాధారణంగా సెలబ్రిటీలు ఎక్కడైనా బయట కన్పిస్తే అభిమానులు ఎగపడిపోతూ ఉంటారు. కానీ ఇద్దరికీ మధ్య సెక్యూరిటీ గార్డులు అడ్డుపడతారు. సెలబ్రిటీలను అభిమానునులు చుట్టుముట్టేసి ఊపిరాడకుండా చేయకముందే గార్డులు అలర్ట్ అయ్యి, దూరం పెట్టేస్తారు. ఇక సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరగడంతో స్టార్స్ అంతా అలర్ట్ అయ్యారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి బడా హీరోలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడం దాదాపు మానేశారు. వీళ్ళకు ఏ నుంచి జెడ్ వరకు ఎన్ని సెక్యూరిటీలు ఉంటే అన్నీ సెక్యూరిటీలు ఇచ్చేశారు. మరి ఆ ఖర్చంతా ఎవరు భరిస్తారు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను తెలుసుకుందాం.

స్టార్స్ కి ప్రాణహాని

అన్నూ కపూర్ ‘హమారే బారా’ సినిమాతో ప్రాణహాని బెదిరింపులను ఎదుర్కొన్నారు. అయితే ఆయనకు మహారాష్ట్ర పోలీసులు భద్రత కల్పించారు. ఈ సినిమా టీజర్‌ విడుదలైనప్పటి నుంచి అన్నూ కపూర్‌కి బెదిరింపులు రావడంతో ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఆయన ఫిర్యాదు మేరకు అన్నూ కపూర్‌కు పోలీసులు ఎక్స్‌ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మరోవైపు సల్మాన్ ఖాన్ కి కూడా ఇలాగే సెక్యూరిటీని ప్రొవైడ్ చేశారు.

Why do actors get Z security even though they didn't do any favour to India? - Quoraఎక్స్ – సెక్యూరిటీ అంటే…

ఇద్దరు సాయుధ పోలీసులనుపరిమిత సమయం వరకు లేదా తదుపరి నోటీసు వచ్చే వరకు సెలబ్రిటీని రక్షించడానికి నియమిస్తారు. ఈ భద్రతా అధికారులు సాధారణంగా నటులు ప్రయాణించే వాహనంలోనే ప్రయాణిస్తారు. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్‌లకు ప్రభుత్వం X భద్రతను కల్పించింది. అమితాబ్ బచ్చన్‌కు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం ఇదే తరహా భద్రతను కల్పించింది. అయితే గత ఏడాది వారికి వచ్చిన బెదిరింపుల తర్వాత ఈ భద్రతను అప్‌గ్రేడ్ చేశారు.

- Advertisement -

వై భద్రత అంటే

అమితాబ్ బచ్చన్, వివేక్ అగ్నిహోత్రిలకు వై భద్రత కల్పించారు. ఈ భద్రతలో 1 లేదా 2 కమాండోలు, 5 నుండి 6 మంది పోలీసు అధికారులు సెలబ్రిటీలకు రక్షణగా ఉంటారు. వీఐపీ వ్యక్తితో ప్రయాణించేందుకు ప్రభుత్వం వారికి ఒకటి లేదా రెండు వాహనాలను అందజేస్తుంది. ఈ సెక్యూరిటీకి నెలకు దాదాపు 10 నుంచి 12 లక్షల రూపాయలు ఖర్చవుతుంది. ఈ భద్రతను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది. కానీ కొన్ని వార్తల ప్రకారం చాలా మంది సెలబ్రిటీలు ఈ సేవ కోసం ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తారు.

Y+ భద్రత

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, కంగనా రనౌత్‌లకు Y+ భద్రత కల్పించారు. కంగనాకు కేంద్ర ప్రభుత్వం, ఖాన్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది. వాస్తవానికి దాదాపు 11 మంది వ్యక్తులు Y+ భద్రతలో ఉన్నారు. 11 మందితో కూడిన ఈ బృందంలో 2 నుంచి 4 మంది కమాండోలు, 7 నుంచి 9 మంది పోలీసు అధికారులు ఉంటారు. వీటితో పాటు బుల్లెట్ ప్రూఫ్ కారు, ఒకటి లేదా రెండు పోలీసు వ్యాన్లను కూడా ప్రయాణానికి సమకూర్చారు. ఈ సెక్యూరిటీకి నెలకు 15 నుంచి 16 లక్షలు ఖర్చు అవుతుంది. Y+ సెక్యూరిటీలో సెలబ్రిటీలకే కాకుండా సెలబ్రిటీల కుటుంబ సభ్యులకు కూడా పోలీసు అధికారి భద్రత కల్పిస్తారు.

ప్రైవేట్ సెక్యూరిటీ

సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అమితాబ్ బచ్చన్ ఇలా పెద్ద పెద్ద సెలబ్రిటీలందరికీ ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. కానీ నటీనటులు తమ మరియు కుటుంబ భద్రత కోసం ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారు. సల్మాన్ ఖాన్, అతని కుటుంబ సభ్యుల భద్రతా బాధ్యతలను షేరా నిర్వహిస్తుంది. అమితాబ్ బచ్చన్, అలియా భట్, రణబీర్ కపూర్, కియారా అద్వానీ మరియు సిద్ధార్థ్ మల్హోత్రా వంటి చాలా మంది నటులు కూడా ఖరీదైన ప్రైవేట్ సెక్యూరిటీని తీసుకుంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు