Lavanya Tripathi: లావణ్య త్రిపాఠి... ఈ పేరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఇండస్ట్రీలో మారు మోగుతుంది. ఈ బ్యూటీ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదు. చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ని ఇష్టపడుతూ ఉంటుంది లావణ్య. టాలీవుడ్ లో మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఇటీవల వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని మెగా ఇంటికి కోడలు అయిపోయింది.
ఇక ఇదిలా ఉంటే రీసెంట్గా లావణ్య త్రిపాఠి కాళ్లకు గాయం అయ్యింది. ఈ క్రమంలోనే ఇంటిపట్టునే ఉంటుంది ఈ బ్యూటీ. కాగా ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఇదే సమయంలో ఓ అభిమాని..” నన్ను వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటావా? ” అని ప్రపోజల్ పెట్టాడు.
దీనికి లావణ్య దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చింది. ” పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటారు కదా. దానిని నేను బాగా నమ్ముతాను. నాకు ఈ జన్మకే కాదు వచ్చే ఏడు జన్మలకు కూడా వరుణ్ తేజ్ భర్తగా రావాలి ” అంటూ ఎమోషనల్ అయింది. ప్రజెంట్ లావణ్య త్రిపాఠి చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.