Kalki 2898 AD: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న తర్వాత ప్రభాస్‌కు తిరుగులేకుండా పోయింది. ఆ తర్వాత చత్రపతి,మిర్చి.. ముఖ్యంగా బాహుబలి, లాంటి సినిమాలు చేసి పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు.
ఇక ప్రస్తుతం ప్రభాస్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అందులో ఒకటి కల్కి. ప్రపంచవ్యాప్తంగా ఈ కల్కి సినిమా (Kalki 2898 AD) కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా చాలా డిఫరెంట్ కథతో ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.. ఈ సినిమా కోసం… ప్రపంచమే ఎదురుచూసేలా హైప్ క్రియేట్ చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్.
అంతేకాదు ఈ పాన్ ఇండియా సినిమాలో… అమితా బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్ పశుపతి, అన్నాజైన్ లాంటివారు నటిస్తున్నారు. ఈ సినిమాను 600 కోట్ల బడ్జెట్ తో… వై జయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ మంచి సక్సెస్ అందుకుంది. ఇక…. ఈ సినిమా నుంచి అదిరిపోయే సాంగ్ రాబోతున్నట్లు తాజాగా కల్కి టీం ప్రకటించింది. ఇండియాలోనే పెద్ద సాంగ్ అంటూ… ఓ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. కాగా ఈ సినిమా ఈనెల 27వ తేదీన థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.