Disney Plus Hotstar : కోర్టులో డిస్నీపై కాపీ రైట్ కేసు… బాహుబలి నిర్మాతల సిరీస్ ను తొలగించాలని డిమాండ్

Disney Plus Hotstar : ఎప్పటికప్పుడు పలు కొత్త సిరీస్ లు, సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వివాదంలో చిక్కుకుంది. మరొక పాపులర్ సంస్థ డిస్నీపై కాపీ రైట్ ఆరోపణలు చేస్తూ కోర్టుకెక్కింది. అంతేకాకుండా తాము ఆరోపణలు చేసిన ఆ సిరీస్ ను డిలీట్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. ఇంతకీ ఏ వెబ్ సిరీస్ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది? అనే వివరాల్లోకి వెళ్తే…

డిస్నీపై పాకెట్ ఎఫ్ఎం పిటిషన్

ఇటీవల కాలంలో మంచి మంచి స్టోరీలతో పాకెట్ ఎఫ్ఎమ్ బాగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ సంస్థ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తన ఆడియో సిరీస్ కాపీరైట్ ను ఉల్లంఘించింది అని ఆరోపిస్తూ ఢిల్లీ హైకోర్టులో వాజ్యం దాఖలు చేసింది. కోర్టు వెంటనే డిస్నీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. ఆన్లైన్ ఆడియో ప్లాట్ఫామ్ పాకెట్ ఎఫ్ఎమ్ లో ఎన్నో రకాల స్టోరీలు ఆడియోల రూపంలో అందుబాటులో ఉంటాయి. అయితే వాటిలో పాపులర్ అయిన సిరీస్ లలో యక్షిణి అనే ఆడియో సిరీస్ కూడా ఒకటి. ఈ సిరీస్ ను పెయిడ్ కస్టమర్స్ కోసం ప్రత్యేకంగా అందిస్తోంది పాకెట్ ఎఫ్ఎమ్. హారర్, సస్పెన్స్ వంటి అంశాలతో వినడానికి ఎంతో అద్భుతంగా ఉండే ఈ సిరీస్ నే డిస్నీ కాపీ చేసింది అంటూ తాజాగా ఆరోపించారు.

Disney+ Hotstar - Watch TV Shows, Movies, Specials, Live Cricket & Football

- Advertisement -

యక్షిణి సిరీస్ కు సంబంధించిన కాపీరైట్ హక్కులు పూర్తిగా పాకెట్ ఎఫ్ఎంకె ఉన్నాయి. తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో అదే టైటిల్ తో, అచ్చం అలాంటి స్టోరీ తోనే హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ అంశాలను కలగలిపి యక్షిణి వెబ్ సిరీస్ ను రిలీజ్ చేశారు. దీంతో విషయం తెలుసుకున్న పాకెట్ ఎఫ్ఎమ్ డిస్నీ నుంచి యక్షిణి సిరీస్ ను డిలీట్ చెయ్యాలని కోరుతూ జూన్ 11న ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నిజానికి అంతకంటే ముందే డిస్నీ యక్షిని వెబ్ సిరీస్ ను జూన్ 14న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే హాట్ స్టార్ మాతృ సంస్థ అయిన నోబి డిజిటల్ ఎంటర్టైన్మెంట్ పై పాకెట్ ఎఫ్ఎమ్ కోర్టులో దావా వేసి, ట్రైలర్ ను తొలగించేలా సదరు సంస్థను ఆదేశించాలని అభ్యర్థించారు.

డిస్నీ కి ధర్మాసనం ఆదేశాలు

జూన్ 13న జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మసనం ఈ పిటిషన్ ను విచారించారు. ఈ కాపీ వ్యవహారంపై డిస్నీ ప్రత్యుత్తరాన్ని దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. కాగా 2021 మే నుంచి యక్షిణి అనే ఆడియో సిరీస్ పాకెట్ ఎఫ్ఎంలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించి 1000 కి పైగా ఎపిసోడ్లు ఉండగా, తాజాగా డిస్నీలో రిలీజైన యక్షిణి ఆరు ఎపిసోడ్స్ ఉంది. హాట్ స్టార్ తో కలిసి బాహుబలి నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా బ్యానర్ పై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్ ను నిర్మించారు. వేదిక, రాహుల్ విజయ్, మంచు లక్ష్మి, అజయ్ ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించగా, తేజ మార్ని దర్శకత్వం వహించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు