Kannappa Teaser : కన్నప్ప టీజర్ రిలీజ్, టీజర్ లో ఖర్చు కనిపిస్తుంది కలెక్షన్స్ ఏమవుతాయో…

Kannappa Teaser: ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. ప్రజెంట్ వర్త్ ఉన్న కథ ఏం చేసినా కూడా దాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడానికి సిద్ధమవుతుంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఇప్పటికే చాలా పాన్ ఇండియా సినిమాలు తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసాయి. ఇప్పుడు తెలుగులో తలకెక్కిపోతున్న మరో పాన్ ఇండియా సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.

మహాభారతం అనే హిందీ సీరియల్ డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు సాధించుకున్న ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను మంచు విష్ణు “అవా ఎంటర్టైన్మెంట్స్” “24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ” బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చాలామంది పెద్దపెద్ద స్టార్లు నటిస్తున్నారు అక్షయ్ కుమార్ శివరాజ్ కుమార్ మోహన్ లాల్ వంటి స్టార్స్ అందరూ కూడా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటన్నిటికీ మించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో నటించిన ఉన్నట్లు ఇదివరకే వార్తలు వినిపించాయి.

అయితే ప్రభాస్ ఈ సినిమాలో శివుని పాత్రలో కనిపిస్తాడు అంటూ ఇదివరకే వార్తలు వినిపించాయి. కానీ రీసెంట్ గా అక్షయ్ కుమార్ ఈ సినిమాలో శివుడు గా కనిపిస్తున్నాడని కొన్ని వార్తల ద్వారా తెలిసింది అయితే అక్షయ్ కుమార్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయింది.

- Advertisement -

టీజర్ టాక్

ఇక రీసెంట్ గా కన్నప్ప టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అందరూ ఊహించినట్లుగానే ఈ టీజర్ ప్రేక్షకులకు విపరీతమైన అంచనాలను సినిమాపై పెంచింది అని చెప్పొచ్చు. దాదాపు 50 మంది విలన్లను హీరో ఒక్కడే తన బాణంతో మట్టికరిపించిన హై యాక్షన్ సీక్వెన్సెస్ మనం ఈ టీజర్ లో గమనించవచ్చు. మంచు విష్ణు నెవర్ బిఫోర్ అవతార్ గా కన్నప్ప టీజర్ లో కనిపిస్తున్నాడు. అలానే ఈ సినిమా టీజర్ చూస్తుంటే సినిమాని చాలా రిచ్ గా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో మిగతా పెద్ద యాక్టర్స్ ఎవరిని పెద్దగా రివీల్ చేయలేదు. గెటప్ లో ఉన్న ప్రభాస్ యొక్క కేవలం కళ్ళను మాత్రం రివీల్ చేశారు.

ఇకపోతే మంచు ఫ్యామిలీకి చెప్పుకోదగ్గ హిట్ సినిమా పడి దాదాపు చాలా ఏళ్లయింది ఎన్నో సినిమాలు చేసినా కూడా ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయాన్ని సాధించుకోలేదు. కన్నప్ప సినిమా పైన కొంత మేరకు అంచనాలు ఉన్నాయి కేవలం మంచు విష్ణు మాత్రమే నటిస్తున్నాడని కాకుండా మిగతా స్టార్లు బట్టి కూడా ఈ సినిమాకు ఓపెనింగ్స్ వచ్చి అవకాశం ఉంది. సినిమా కొంచెం బాగున్న కూడా బానే వర్కౌట్ అవుతుంది అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు