Amala Paul : ‘రెండో’ వివాదం

హీరోయిన్ అమలాపాల్ ఇటీవలే తన మాజీ ప్రియుడు భవీందర్ సింగ్ వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసి అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విధితమే. దీంతో పోలీసులు కూడా భవీందర్ ని అరెస్ట్ చేశారు. తాజాగా అతను బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ.. 2019లో అమలాపాల్ తో పెళ్లి జరిగిందని అందుకు సంబంధించిన సాక్షాలను సైతం కోర్టుకి అప్పగించాడు. కోర్టు వీటిని పరిశీలించి బెయిల్ మంజూరు చేసింది. 

అమలాపార్ పెళ్లి వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. 2014లో దర్శకుడు విజయ్ ని అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక ఆ తరువాత వీరి మధ్య విభేదాలు రావడంతో 2017లో విడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆమె సింగిల్ గా నే ఉన్నట్టు అంతా భావించారు. కానీ మధ్యలో కొన్ని రోజులు సింగర్ భవీందర్ సింగ్ తో అమలాపాల్ లవ్ లో ఉన్నట్టు, వీరిద్దరికీ పెళ్లి అయినట్టు వార్తలు వినిపించినా అమలాపాల్ అలాంటివి ఏం లేవని కొట్టి పారేసింది. 

అమలాపాల్, భవీందర్ సింగ్ గతంలో పెళ్లి దుస్తుల్లో ఉన్న ఫోటోలు బయటికీ రాగా అవి ఓ ప్రమోషన్ షూట్ అని చెప్పింది. భవీందర్ కోర్టులో తనకి, అమలాపాల్ కి పెళ్లి జరిగిందని చెప్పడంతో అందరూ ఆశ్యర్యపోయారు. ఎవ్వరికీ తెలియకుండా అమలాపాల్ రెండో పెళ్లి చేసుకుందా..? విబేధాలు వచ్చి విడిపోయిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అమలాపాల్ మాత్రం రెండో పెళ్లిపై ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు