Mr Bachchan: మిస్టర్ బచ్చన్ షో రీల్ సెలబ్రిటీస్ రియాక్షన్

Mr Bachchan: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో రవితేజ ఒకరు. ముందుగా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేసి ఆ తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోగా నిలబడ్డాడు. చాలామందికి నెగటివ్ ఫ్యాన్స్ ఉంటారు కానీ రవితేజకు ఉండరు. ఎందుకంటే అందరూ హీరో ఫ్యాన్స్ కూడా రవితేజను ఇష్టపడతారు. రవితేజ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న టైంలోనే నిన్ను పెట్టి సినిమా చేస్తాను అని పూరీ జగన్నా థ్ రవితేజతో అంటూ ఉండేవాడు. అయితే ఆ విషయం రవితేజ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పూరీ మాత్రం ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకుని రవితేజతో సినిమాలు చేసి రవితేజ స్టార్ హీరోయిన్ చేసేసాడు.

రవితేజ ఎన్నో సినిమాలు చేసి చాలా మంది కొత్త దర్శకులని కూడా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. బాబి, హరీష్ శంకర్, గోపీచంద్ మలినేని వంటి ఎంతోమంది దర్శకులు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రవితేజ వలన పరిచయమయ్యారు. రవితేజ పరిచయం చేసిన టాలెంటెడ్ డైరెక్టర్లు హరీష్ శంకర్ ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో ఇదివరకే రెండు సినిమాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి ఇప్పుడు ముచ్చటగా మూడో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకి మిస్టర్ బచ్చన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు. సినిమాకు సంబంధించిన షో రీల్ రిలీజ్ చేశారు దీనిపై పలువురు సెలబ్రిటీస్ స్పందిస్తూ వచ్చారు.

- Advertisement -

వారందరికీ కూడా తనదైన స్టైల్ లో రిప్లై ఇస్తూ వచ్చాడు హరీష్ శంకర్. అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, వంశీ పైడిపల్లి, బివిఎస్ రవి వంటి ఎంతోమంది సినిమా ప్రముఖులు ఈ షో రీల్ పై ప్రశంసలు అందించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు