Chandini Chowdary : రెండూ బెడిసికొట్టేశాయి పాపం.. ఈ తెలుగమ్మాయి కష్టం వృధా అయిందిగా..!

Chandini Chowdary : టాలీవుడ్ లో ఉన్న టాలెంటెడ్ తెలుగు హీరోయిన్లలో చాందిని చౌదరి ఒకరు. పదేళ్ల కింద షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరియర్ మొదలు పెట్టి కేటుగాడు అనే చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ‘మను’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అయితే చాందిని ని కి బ్రేక్ ఇచ్చింది మాత్రం ‘కలర్ ఫోటో’ సినిమాయే. ఈ సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి (Chandini Chowdary) వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇక ఈ ఇయర్ అల్రెడి విశ్వక్ సేన్ తో కలిసి గామి చిత్రంలో నటించగా ఆ సినిమాలో హీరోయిన్ కాకపోయినా సెకండ్ లీడ్ గా నటించి మంచి హిట్ అందుకుంది. ఇకపోతే ఇప్పుడు తాజాగా “మ్యూజిక్ షాప్ మూర్తి”, “యేవం” చిత్రాలతో ప్రేక్షకులని పలకరించింది ఈ అమ్మాయి. ఈ రెండు సినిమాలు కూడా జూన్ 14న థియేటర్లలో ఒకేసారి విడుదల కావడం జరిగింది. చాందిని ప్రధాన పాత్రల్లో నటించిన రెండు సినిమాలు కూడా ఒకేరోజు విడుదల కావడం చాలా అరుదైన విషయం అని చెప్పాలి. ఇక అప్పుడెప్పుడో శృతి హాసన్ నటించిన రెండు సినిమాలు సంక్రాంతి సమయంలో ఒకేసారి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మరో హీరోయిన్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి ఒకేరోజు థియేటర్లలో విడుదలయ్యాయి.

Yevam and Music Shop Murthy starring Chandini Chowdary were flops

ప్రమోషన్ల కోసం కష్టపడ్డ చాందిని..

ఇక ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలో నటుడు అజయ్ ఘోష్ ప్రధాన పాత్రలో నటించగా, మరో ముఖ్య పాత్రలో ఫిమేల్ లీడ్ గా చాందిని చౌదరి నటించింది. ఈ సినిమాని శివ పలడుగు డైరెక్ట్ చేయగా, కామెడీ & ఎమోషనల్ ఎంటర్టైనర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 14న రిలీజ్ అయింది. అలాగే చాందిని చౌదరి మెయిన్ లీడ్ గా ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించిన సినిమా “యేవం”. ఈ సినిమాలో వశిష్ఠ సింహ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాను ప్రకాష్ దంతులూరి డైరెక్ట్ చేయగా, ఈ సినిమా కూడా జూన్ 14న రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో కూడా చాందినిచౌదరి మెయిన్ లీడ్ గా నటించగా, గత కొన్ని రోజులుగా చాందిని చౌదరి విపరీతంగా ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఒక సినిమాని తక్కువ ఎక్కువా చేయకుండా రెండు సినిమాలని బాగా ప్రమోట్ చేస్తూ వచ్చింది. చాలా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ, రిలీజ్ డే వరకూ కష్టపడగా, రిలీజ్ తర్వాత కూడా థియేటర్ల వద్ద సందడి చేస్తూ కనిపిస్తుంది.

- Advertisement -

చాందిని కష్టం వృధా అయిందిగా!

అయితే చాందిని ఎంతో కష్టపడి ప్రమోట్ చేసిన ఈ రెండు సినిమాలు ప్లాప్ కావడం జరిగింది. అసలు సినిమాల టాక్ గురించి చెప్పుకుంటే చాందిని మెయిన్ లీడ్ గా నటించిన యేవం డిజాస్టర్ టాక్ తెచ్చుకోగా, మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాకే డీసెంట్ టాక్ వచ్చింది. కానీ రెండు సినిమాలు డిజాస్టర్ ఓపెనింగ్స్ తెచ్చుకోగా, పోటీగా రిలీజ్ అవడంతో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. మ్యూజిక్ షాప్ మూర్తి అక్కడక్కడా ఆడుతున్నా, ఆ కలెక్షన్లు థియేటర్ల లెక్కలకే సరిపోతున్నాయి. రెండు సినిమాలకి కోటి రూపాయల కలెక్షన్లు కూడా రాలేదు. ఏది ఏమైనా చాందిని చౌదరి కష్టం వృధా అయిందని నెటిజన్లు అంటున్నారు. ఇక ముందు ముందు అయినా మంచి స్క్రిప్ట్ లు ఎంచుకుని సక్సెస్ దిశగా ముందుకు వెళ్తుందా చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు