Harsha Sai: బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడానికి అన్ని లక్షల.? హర్ష సాయి చీకటి కోణాలు బయట పడితే చితక్కొట్టడం ఖాయం

Harsha Sai: ప్రస్తుత కాలంలో ఫేమస్ అవడం అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. ఎప్పుడు ఎవడు ఎందుకు ఫేమస్ అవుతుందో కూడా ఎవరూ ఊహించట్లేదు. ఎవరికి అంత చిక్కడం లేదు. సినిమా చూసి వచ్చి థియేటర్ ముందు అరిచే వాడు కూడా కొన్ని రోజులు పోతే ఏదో ఒక సినిమాలో కనిపిస్తున్నాడు. లేకపోతే చాలామంది యూట్యూబర్స్ అంతా కూడా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. చిన్న చిన్న పాత్రలో కనిపిస్తున్నారు. చాలామంది యూట్యూబ్ ను ఒక ఇన్కమ్ సోర్స్ గా వాడుకుంటూ వస్తున్నారు. కొంతమంది జబర్దస్త్ వంటి షోలో కూడా కనిపిస్తూ ఉన్నారు.

ఇకపోతే తెలుగులో ఉన్న టాప్ యూట్యూబర్స్ లో హర్ష సాయి ఒకరు. హర్ష సాయి ఛానల్ గురించి హర్ష సాయి వీడియోస్ గురించి తెలియని వాళ్ళు ఉండరు. ఎంతోమందికి సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి సాయం చేయడం వంటి వీడియోస్ హర్ష సాయి ఛానల్ లో చూడొచ్చు. హర్ష సాయి వీడియోస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి. అందుకని ఆ వీడియోస్ కూడా బాగా వైరల్ గా మారుతాయి. హర్ష సాయి చేసిన ఎన్నో వీడియోస్ కి మిలియన్స్ లో వ్యూస్ వచ్చి మంచి యూట్యూబ్ రెవెన్యూ వచ్చింది.

Harsha Sai

- Advertisement -

అయితే కొంతమంది మాత్రం హర్ష సాయిని ఒక హీరోల ట్రీట్ చేస్తారు. కానీ ఇంకొంతమంది మాత్రం అసలు ఆ వీడియోస్ వెనకాల ఉన్న చీకటి కోణాల్ని బయట తీసి పనిలో పడ్డారు. హర్ష సాయి ఈ వీడియోస్ చేయడంతో పాటు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్నాడు. అయితే వీటి వలన చాలామంది ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి వస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ వలన చాలామంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. మంచి చేస్తున్నట్లు వీడియోస్ చేస్తూ దాని ద్వారా బెట్టింగ్ ప్రమోట్ చేసి చాలామంది చావు కారణం అవుతున్నాడు వీడియోస్ చేస్తున్నారు కొంతమంది.

ఇకపోతే రీసెంట్ గా హర్ష సాయి ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తనే దర్శకుడుగా హీరోగా ఒక పాన్ ఇండియా సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను కూడా రిలీజ్ చేశారు. ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇకపోతే హర్ష సాయి ఒక బెట్టింగ్ యాప్ కి దాదాపు 70 లక్షల వరకు ప్రమోట్ చేయడానికి తీసుకుంటాడని కొంతమంది విమర్శిస్తున్నారు. అతి త్వరలో ఈ చీకటి కోణాలన్ని బయటపడి పోలీసులు జైల్లో వేసి హర్ష సాయిని చితక్కొడతారు అంటూ సోషల్ మీడియా వేదికగా కొంత మంది కామెంట్స్ పెడుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు