HBD Kajal Agarwal: ఫస్ట్ క్రష్ అతడే.. కాలేజ్ డేస్ లోనే వన్ సైడ్ లవ్..!

HBD Kajal Agarwal.. సెలబ్రిటీలైనా .. సామాన్యులైనా ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక ఫస్ట్ లవ్ ఉంటుంది. అయితే కాలక్రమేనా కొంతమంది ఆ లవ్ ను కొనసాగిస్తూ పెళ్లిగా మార్చుకుంటే.. మరి కొంతమంది అనుకోని కారణాలవల్ల బ్రేకప్ చెప్పుకొని దూరం అవుతూ ఉంటారు. ఇక సామాన్యుల గురించి అటుంచితే ముఖ్యంగా సెలబ్రిటీల గురించి చెప్పుకోవాలి.. వీరి గురించి ఏ చిన్న విషయం బయటకు వచ్చినా సరే అది క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే చందమామగా టాలీవుడ్ లో భారీ పాపులారిటీ సంపాదించుకున్న కాజల్ అగర్వాల్ కూడా తన ఫస్ట్ క్రష్ గురించి చెప్పుకొచ్చింది. అందులోనూ వన్ సైడ్ లవ్ అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది ఈ ముద్దుగుమ్మ.. మరి ఈరోజు కాజల్ పుట్టినరోజు సందర్భంగా పలు విషయాలు వైరల్ గా మారుతున్నాయి.. అందులో భాగంగానే కాజల్ ఫస్ట్ లవ్ కూడా తెరపైకి రావడం గమనార్హం..

అతడే ఫస్ట్ క్రష్..కానీ వన్ సైడ్ లవ్..

HBD Kajal Agarwal: He was the first crush.. One sided love in college days..!
HBD Kajal Agarwal: He was the first crush.. One sided love in college days..!

అసలు విషయంలోకెళితే కాజల్ తన ఫస్ట్ క్రష్ పేరును రివీల్ చేసింది.. కాలేజీలో అక్షయ్ అనే వ్యక్తి తన ఫస్ట్ క్రష్ అంటూ చెప్పుకొచ్చింది.. ఆ తర్వాత కొన్నాళ్లకు మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. క్రికెట్ అంటే తనకు చాలా ఆసక్తి అని .. రోహిత్ శర్మకు తాను వీరాభిమానిని అని కూడా చెప్పుకొచ్చింది.. అతనిపై క్రష్ ఉందని చెప్పిన ఈ బ్యూటీ.. వన్ సైడ్ లవ్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది.. ఇక తర్వాత సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కాజల్ అగర్వాల్.

తండ్రీకొడుకులతో నటించిన ఘనత..

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన కాజల్ అగర్వాల్ .. ఇప్పుడు బాలీవుడ్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. తెలుగులో లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమైన ఈమె.. చందమామ సినిమాతో బ్లాక్ బస్టర్ ని అందుకుంది ..ఈ సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో కాజల్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీ దక్కించుకున్న కాజల్.. చిరంజీవి , రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోలు అందరితో కూడా జతకట్టి మెప్పించింది. అంతేకాదు తండ్రి కొడుకులతో కూడా రొమాన్స్ చేసిన ఘనత ఈమె సొంతం అని చెప్పవచ్చు.

- Advertisement -

రీయంట్రీ లోనూ సత్తా చాటుతున్న కాజల్..

సినీ కెరియర్లో స్టార్ పొజిషన్ లో ఉన్నప్పుడే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్ లుని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఒక కొడుకుకు జన్మనిచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఒక ఏడాది పూర్తిస్థాయిలో కసరత్తులు చేసి తన బాడీని మళ్లీ ఫిట్ గా మార్చుకొని.. బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్ర పోషించగా.. శ్రీ లీల కీలక పాత్ర పోషించింది. కొన్ని రోజుల క్రితం లేడీ ఓరియంటెడ్ మూవీ సత్యభామ తో సందడి చేస్తోంది కాజల్ . అలాగే ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో కూడా నటిస్తోంది అంటూ వార్తలు వచ్చాయి కానీ ఈమె ఇండియన్ 3 లో భాగం కానుందని సమాచారం.. అంతేకాదు ఈ సినిమా కోసం ఈమె ప్రత్యేకంగా గుర్రపు స్వారీ కూడా నేర్చుకుందట. మరి ఇండియన్ 3లో కాజల్ నటన ఎలా ఉంటుందో చూడాలి. ఇకపోతే ఈరోజు కాజల్ పుట్టినరోజు కావడంతో అటు సెలబ్రిటీలు, ఇటు అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు