Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడి శిరీష్ భరద్వాజ్ మృతి

Sirish Bharadwaj: టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ గురించి అందరికీ తెలుసు.. ఆయన తాజాగా మృతి చెందినట్లు వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ నెట్టింట హల్ చల్ చేస్తుంది.. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్న ఆయన ఇవాళ మృతి చెందారు.. శిరీష్ భరద్వాజ్ కు
లంగ్స్ డ్యామేజ్ అవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలుస్తుంది..

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ గతంలో శీరిష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి, పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2007 వీరి మ్యారేజ్ తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషన్ అయింది. సినిమాలో జరిగే చేజింగులకు ఏ మాత్రం తీసిపోకుండా అప్పట్లో హైదరాబాద్ రోడ్లపై హడావుడి జరిగింది.. మీడియా కవరేజ్ కూడా ఉండటంతో ఆ వార్త పెద్ద సెన్సేషనల్ అయ్యింది.. ఆ తర్వాత వారిద్దరూ కుటుంబానికి దూరంగా ఉన్నారు.. వారికి ఒకపాప కూడా పుట్టింది.. ఆ తర్వాత మనస్పర్థలు కారణంగా ఇద్దరు విడిపోయారు.

ఆ తర్వాత ఇద్దరు వేరేవాళ్ళను పెళ్లి చేసుకున్నారు.. వారిద్దరికీ పుట్టిన పాప ఇప్పుడు శ్రీజ దగ్గరే ఉంది.. శ్రీజ ప్రస్తుతం రెండో భర్తకు కూడా దూరంగా ఉంది.. తన మాజీ భర్తను చూడటానికి శ్రీజ వెళ్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు