Ashwin: డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్న అశ్విన్ బాబు.. శివం భజే టీజర్ పై క్రేజీ అప్డేట్..!

Ashwin: హిడింబా వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో మంచి పేరును సంపాదించుకున్నాడు అశ్విన్ బాబు. ఓంకార్ తమ్ముడుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్ బాబు ప్రెసెంట్ వరస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ప్రజెంట్ అశ్విన్ బాబు హీరోగా దిగాంగన సూర్యవంశీ కాంబోలో వస్తున్న మూవీ శివం భజే.

ఈ మూవీకి అప్సర్ దర్శకత్వం వహిస్తుండగా గంగా ఎంటర్టైన్మెంట్ మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షించుకుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన అశ్విన్ లుక్ ప్రతిఒక్కరిని మైమరిపిస్తుంది.

Ashwin Babu new movie updates
Ashwin Babu new movie updates

ఉగ్రరూపంలో ఉన్న అశ్విన్ ఓవైపు శివస్మరణ తో టైటిల్ .. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ ముఖ్య పాత్ర.. ఇలా అనౌన్స్ చేసిన ప్రతి అప్డేట్ కి పెరుగుతున్న అంచనాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాతలు రేపు సాయంత్రం 4:05 గంటలకు టీజర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు మేకర్స్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు