Priyanka Chopra : షూటింగ్ లో ప్రియాంకకు గాయం… పీక తెగేంత కష్టపడిన గ్లోబల్ బ్యూటీ

Priyanka Chopra : గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాకు తాజాగా తన మూవీ షూటింగ్ లో గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తన ఫాలోవర్స్ కు తెలియజేసింది. మరి ఆమె ఏ సినిమా షూట్ లో గాయపడింది? ఆ గాయం సంగతేంటో తెలుసుకుందాం పదండి.

హాలీవుడ్ మూవీ షూటింగ్ లో ప్రియాంక

ప్రియాంక చోప్రా ప్రస్తుతం ది బ్లఫ్ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్‌లోనే ఆమె తాజాగా గాయపడింది. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రియాంక గాయానికి సంబంధించిన పిక్ ను పంచుకుంది. ది బ్లఫ్ మూవీ షూటింగ్ లో స్టంట్స్ చేస్తున్నప్పుడు గాయమైంది అంటూ ప్రియాంక ఆ పోస్ట్ లో వెల్లడించింది. అందులో తన మెడపై గీరుకుపోయినట్టుగా కన్పిస్తోంది. కట్ అదృష్టవశాత్తూ లోతుగా కనిపించనప్పటికీ, అది ఆమె అభిమానులకు బాధను కలిగిస్తోంది. సినిమా కోసం కష్టపడితే బాగానే ఉంటుంది గానీ అంతకంటే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలని ప్రియాంక ఫ్యాన్స్ కోరుతున్నారు.

కొన్ని రోజులుగా ఆస్ట్రేలియాలో ‘ది బ్లఫ్’ సినిమా షూటింగ్‌లో పాల్గొంటోంది ప్రియాంక. ఆమె ‘ది బ్లఫ్’లో కార్ల్ అర్బన్‌తో కలిసి పని చేస్తోంది. ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ది బ్లఫ్ చిత్రానికి ఫ్రాంక్ ఇ. ఫ్లవర్స్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా $120 మిలియన్లకు పైగా వసూలు చేసిన హిట్ చిత్రం బాబ్ మార్లే : వన్ లవ్‌కు సహ-రచయితగా పాపులర్ అయిన తర్వాత ఫ్రాంక్ డైరెక్టర్ గా మారాడు.

- Advertisement -

ది బ్లఫ్ స్టోరీ ఇదే

ది బ్లఫ్ 19వ శతాబ్దపు కరేబియన్‌ నేపథ్యంలోనే సాగుతుంది. మాజీ మహిళా పైరేట్ కథను ఈ సినిమాలో చూపించబోతున్నారు. పైరేట్ పాత్రలో ప్రియాంక నటించనుంది. ఈ చిత్రాన్ని ఆంథోనీ రస్సో, జో రస్సో, ఏంజెలా రస్సో-ఓట్‌స్టాట్, మైఖేల్ డిస్కో నిర్మిస్తున్నారు.

పర్సనల్ లైఫ్ కూడా ముఖ్యమే

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారినప్పటికి ఫ్యామిలీతో కూడా వీలైనంత వరకు టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తోంది. తన కుమార్తె మాల్టీ, భర్త నిక్ జోనాస్ తో కలిసి ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ తన తల్లి డాక్టర్ మధు చోప్రా పుట్టినరోజును కూడా ఆస్ట్రేలియాలోనే సెలబ్రేట్ చేసింది.

ప్రియాంక చోప్రా లైనప్

ప్రస్తుతం ప్రియాంక చోప్రాకు చేతి నిండా సినిమాలు ఉన్నాయి. ది బ్లఫ్‌తో పాటు జాన్ సెనాతో సిటాడెల్ 2 చేస్తోంది. ఈ రెండు సినిమాలతో పాటు హెడ్ ఆఫ్ స్టేట్‌తో సహా మరో రెండు హాలీవుడ్ ప్రాజెక్ట్‌లు ఆమె కిట్టిలో ఉన్నాయి. అలియా భట్, కత్రినా కైఫ్ లతో కలిసి మోస్ట్ అవైటెడ్ మూవీ జీ లే జారాతో బాలీవుడ్‌లోకి ప్రియాంక చోప్రా రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. ప్రియాంక పెళ్లి తరువాత పూర్తిగా హాలీవుడ్ సినిమాలకే పరిమితం అయిపోవడంతో ఆమెను హిందీ మూవీ లవర్స్ తెగ మిస్ అవుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు