Kalki 2898 AD Censor Talk : ‘కల్కి’ సెన్సార్ రివ్యూ.. బొమ్మ సూపర్ హిట్టే..

Kalki 2898 AD Censor Talk : యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా హీరో ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ప్రస్తుతం కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. నిన్న ఈ సినిమా స్టోరీ గురించి డైరెక్టర్ అశ్విన్ రివిల్ చేశారు.. దాంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.. సెన్సార్ రివ్యూ ప్రస్తుతం సినిమాకు భారీ హైప్ ను క్రియేట్ చేస్తుంది..

ప్రభాస్ ఎప్పటిలాగే విజ్రుంభించిన్నట్లు సెన్సార్ టాక్ ఉంది.. ఈ మూవీ సస్పెన్స్ లు ఓ రేంజులో ఉన్నట్లు టాక్.. ఇక ట్విస్టులు సినిమాకు హైలెట్ అంట. భైరవ పాత్రలో ప్రభాస్ దుమ్ములేపేశాడట. ఇలాంటి సినిమాను తీయడం ఒక్క నాగ్ అశ్విన్ కు మాత్రమే సాధ్యమని మరోసారి నిరూపించాడు.. నిజంగా అశ్విన్ ఈ సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు.. అతనికి దండం పెట్టాల్సిందే.. గ్రాఫిక్స్, మ్యూజిక్, యాక్షన్ సీన్స్ మాములుగా లేవని చెప్పాలి..

ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడంతో అతని పై ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు.. దాదాపు మూడు గంటల నిడివితో సినిమా రాబోతుంది.. ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది.. అందరు ఊహించినట్లే ఈ సినిమాకు యూ/ ఏ సర్టిఫికెట్ ను అందుకుంది… మరోవైపు నార్త్ అమెరికాలో కూడా రికార్డు బ్రేక్ చేసే వ్యూస్ ను రాబట్టింది.. సినిమా రిలీజ్ అవ్వడానికి కేవలం ఒక వారం మాత్రమే ఉన్నా మేకర్స్ ప్రమోషన్స్ హడావుడి చేయలేదు.. ప్రస్తుతం ప్రభాస్ ముంబై కి ఈవెంట్ కోసం వెళ్లినట్లు తెలుస్తుంది.. ఈ సినిమాకు ఈ టాక్ విడుదల తర్వాత కూడా ఉంటుందేమో తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చెయ్యాల్సిందే..

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు