Mamta Mohan Das: ఆ స్టార్ హీరోతో సినిమా.. నా జీవితమే అస్తవ్యస్తం..!

Mamta Mohan Das: ప్రముఖ హీరోయిన్ మమత మోహన్ దాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఆకట్టుకుంది.. ఇక ఈమధ్య అడపాదడపా సినిమాలలో చేస్తూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఇదిలా ఉండగా ఈమె ఒక స్టార్ హీరోతో సినిమా చేయడం వల్లే తన కెరీర్ నాశనమైందంటూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

రజనీకాంత్ సినిమాలో ఎందుకు నటించానా అనిపించింది..

Mamta Mohan Das: A movie with that star hero.. My life is a mess..!
Mamta Mohan Das: A movie with that star hero.. My life is a mess..!

మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది మమత మోహన్ దాస్.. అలాగే తెలుగులో కూడా పలు చిత్రాలలో నటించింది..ఈమె నటి మాత్రమే కాదు సింగర్ కూడా.. తెలుగు, మలయాళంతో పాటు తమిళ్లో కూడా నటించి మెప్పించింది. ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కుసేలన్ అనే సినిమాలో మమతా కూడా నటించింది. ఇందులో హీరోయిన్ గా నయనతార నటించింది .అయితే ఈ సినిమాలోనే మమత మోహన్ దాస్ ఒక పాటలో కనిపించింది. ఈ పాట కోసం రెండు రోజులు షూట్ కూడా చేసిందట.. అయితే సినిమా ఎడిటింగ్లో ఆమె పార్ట్ ను పూర్తిగా డిలీట్ చేశారట.. కేవలం ఒక్క సెకన్ లో మాత్రమే అలా కనిపిస్తుందట మమతా మోహన్ దాస్ .. దాంతో అసలు ఈ సినిమాలో ఎందుకు నటించానా అని బాధపడిందట ఈ ముద్దుగుమ్మ.. మొత్తానికి అయితే రజినీకాంత్ సినిమాలో నటించి తప్పు చేశానని భావిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

రజనీకాంత్ కెరియర్..

ఇక రజనీకాంత్ విషయానికి వస్తే.. ఆయనకంటూ ఒక ప్రత్యేక అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా ఆయన నటన, ఆయన స్టైల్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంటాయి. ముఖ్యంగా తెలుగు , తమిళ్ చిత్రాలలో నటిస్తూ భారీ పాపులారిటీ దక్కించుకున్న రజినీకాంత్.. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నారు . అంతేకాదు రజనీకాంత్ విదేశాలలో కూడా పేరు దక్కించుకున్నారు.. ఇప్పుడైతే పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు విడుదల చేస్తూ హీరోలు పాన్ ఇండియా హవా కొనసాగిస్తుంటే… రజనీకాంత్ మాత్రం అప్పట్లోనే విదేశాలలో తన సినిమాలను విడుదల చేసి భారీ క్రేజ్ దక్కించుకున్నారు.. ముఖ్యంగా ఈయన హీరోగా నటించిన ముత్తు సినిమా జపాన్లో విజయవంతంగా ఆడింది.. అక్కడ రికార్డు కూడా క్రియేట్ చేసింది . ముఖ్యంగా జపనీయులు ఎప్పుడైనా ఇండియా వస్తే చెన్నైకి వెళ్లి ప్రత్యేకంగా రజనీకాంత్ ఇంటి ముందు ఫోటోలు దిగి మరీ వస్తారట. ఇక దీన్ని బట్టి చూస్తే జపాన్ లో రజనీకాంత్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక ఇలాంటి స్టార్ హీరో సినిమాలో ఎందుకు నటించాను అని బాధపడుతోంది మమతా మోహన్ దాస్..

- Advertisement -

రజనీకాంత్ సినిమాలు..

ఇప్పటికే 175 సినిమాలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పటికి కుర్ర హీరోలతో పోటీపడి మరీ నటిస్తున్నారు. ఇక తాజాగా జైలర్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. అలాగే ప్రస్తుతం రెండు మూడు సినిమాలను కూడా లైనప్ చేశారు రజనీకాంత్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు