Amitabh Bachchan : ఐశ్వర్య – అభిషేక్ డైవర్స్… రావణ్ మూవీ సాక్షిగా హింట్ ఇచ్చిన బిగ్ బి

Amitabh Bachchan : గత కొంతకాలంగా బాలీవుడ్ సెలబ్రిటీ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారు అనే పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి అటు బచ్చన్ కుటుంబం గానీ, ఇటు ఐష్ కానీ స్పందించలేదు. అయితే తాజాగా బిగ్ బీ అమితాబ్ చేసిన పోస్ట్ చూస్తే తన కొడుకు, కోడలు విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు నిజమేనా అన్పిస్తోంది అంటున్నారు నెటిజన్లు.

బిగ్ బీ హింట్

అసలు విషయం ఏమిటంటే అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ జంటగా మణిరత్నం దర్శకత్వం వహించిన రావణ్ మూవీ నేటితో 14 ఏళ్లు పూర్తి చేసుకుంది. రావణ్ 2010 జూన్ 18న విడుదలైంది. ఈ చిత్రంలో విక్రమ్, గోవింద కూడా నటించారు. ఈ రోజు ఈ ప్రత్యేక సందర్భంలో అమితాబ్ బచ్చన్ తన సోషల్ హ్యాండిల్‌ లో స్పెషల్ పోస్ట్ చేశారు. రావణ్ సినిమాలో అద్భుతమైన నటనను కనబరిచావు అంటూ తన కొడుకు అభిషేక్ బచ్చన్ ను ప్రశంసించారు. అయితే బిగ్ బీ తన కోడలి గురించి నామమాత్రంగా కూడా ప్రస్తావించకపోవడం కొత్త అనుమానాలకు తెర తీసింది.

Aishwarya Rai showers love on Agastya Nanda, calls him to pose with Abhishek, Aaradhya and her at 'The Archies' premiere; Amitabh, Jaya Bachchan and Navya Nanda also join - See photos |

- Advertisement -

అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ లో రావణ్ సినిమాలోని అభిషేక్ సన్నివేశాలకు సంబంధించిన వీడియోను పంచుకున్నారు. “అభిషేక్ మరపురాని పర్ఫార్మెన్స్.. నీ ఇతర చిత్రాలలో కంటే ఇందులో చాలా భిన్నంగా నటించావు. అదే ఒక కళాకారుడికి నిజమైన విలువ, ప్రేమ.” అని రాసుకొచ్చారు అమితాబ్. అమితాబ్ బచ్చన్ తన కుమారుడికి ప్రశంసల పోస్ట్‌ను పంచుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు యువ మూవీ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు కూడా అమితాబ్ సుధీర్ఘమైన నోట్ ను పంచుకున్నారు.

సినిమాలో ఐశ్వర్య కూడా ఉంది !!

ఆయన పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వైరల్ కావడంతో అభిమానులు అమితాబ్ ను ఐశ్వర్య రాయ్ గురించి అడగడం ప్రారంభించారు. నెటిజన్లు ఐశ్వర్య కూడా సినిమాలో అద్భుతంగా ఉంది. ఆమె నటనను మెచ్చుకోకపోవడం సరికాదు అంటూ కామెంట్స్ చేశారు. కానీ మరికొంత మంది మాత్రం అమితాబ్ ట్వీట్ ను ఐష్, అభిషేక్ విడాకుల వార్తలతో లింకు చేస్తున్నారు. ఇంతకు ముందు ఐశ్వర్య తల్లి పుట్టినరోజు వేడుకలకు ఆమె తన కూతురితో మాత్రమే వెళ్ళింది. అక్కడ అభిషేక్ కన్పించకపోవడంతో ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇలా ఎప్పుడు చిన్న మిస్టేక్ జరిగినా అది ఐష్-అభిషేక్ విడాకుల వార్తలకు బలం చేకూరుస్తుంది. ఇలాంటి తరుణంలో అభిషేక్ కేవలం తన కొడుకును మాత్రమే పొగుడుతూ స్పెషల్ పోస్ట్ చేశారు. కనీసం తూతూ మంత్రంగానైనా అమితాబ్ కోడలి గురించి రాయడం లేదా ఐశ్వర్యను ట్యాగ్ చేయకపోవడంతో ఆయనే స్వయంగా ఐష్, అభిషేక్ విడాకుల విషయంపై హింట్ ఇచ్చినట్టుగా అయ్యింది.

కాగా దర్శకుడు షూజిత్ సిర్కార్ అభిషేక్ బచ్చన్ హీరోగా కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇంకా పేరు పెట్టని ఈ సినిమా 2024 నవంబర్ 15న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ జూన్ 17 న రిలీజ్ కాబోతున్న కల్కిలో కీలక పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు