Vijay Sethupathi: రామ్ చరణ్ తో బుచ్చిబాబు చేస్తున్న సినిమా కథను రివీల్ చేసిన విజయ్ సేతుపతి

Vijay Sethupathi: కేవలం తమిళ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులుకు కూడా బాగా దగ్గరయిపోయాడు విజయ్ సేతుపతి. ముందుగా తమిళ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ పిజ్జా సినిమాతో ఎంట్రీ ఇచ్చిన విజయ్ సేతుపతి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకొని భాషతో సంబంధం లేకుండా ఆడియన్స్ ని తన వైపు ఆకట్టుకున్నాడు. భాష అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ పెట్టు మరి విజయసేతుపతి సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ కూడా ఉన్నారు. అయితే రీసెంట్ టైమ్స్ లో అటువంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు విజయ్ సేతుపతి నుంచి రాలేదు అనుకున్న తరుణంలో మహారాజా సినిమాతో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

రీసెంట్గా ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహారాజా సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ సంపాదించుకొని, రోజురోజుకు కలెక్షన్స్ మెరుగవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా ఏంటో చూపిస్తుంది ఈ సినిమా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ప్రమోషన్స్ ని వదల్లేదు విజయ్ సేతుపతి. ఇంకా ప్రేక్షకులు ముందుకు ఈ సినిమా వెళ్లే ప్రయత్నం గా ఇంటర్వ్యూలు ఇస్తూనే ఉన్నాడు. చాలామంది యూట్యూబర్స్ కూడా ఇంటర్వ్యూస్ ఇచ్చాడు విజయ్ సేతుపతి.

Ram Charan

- Advertisement -

ఇక రీసెంట్ గా రాంచరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు తో కూడా ఒక ఇంటర్వ్యూను నిర్వహించింది చిత్ర బృందం. ఈ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు చిత్ర యూనిట్. అయితే ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్ తో సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇంటర్వ్యూలో భాగంగా బుచ్చిబాబు రామ్ చరణ్ తో చేసే సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు విజయ్ సేతుపతి. ఈ సినిమాను బుచ్చిబాబు చాలా బాగా రాశాడు అంటూ మహారాజా డైరెక్టర్ కు చెప్పాడు. ఈ సినిమా కథ మొత్తం నాకు తెలుసు.కచ్చితంగా ఈ సినిమా ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ సేతుపతి చెప్పిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా పైన మంచి కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు