Pushpa2 : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ క్రేజ్ పుష్ప 2 సినిమాతో నేషనల్ వైడ్ పెరిగింది.. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా మరో పుష్ప2 సినిమా రాబోతుంది.. ఈ సినిమా సినిమా కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు.. ఈ సినిమాను ఆగస్టు 15 న ముందుగా విడుదల చేస్తామని ప్రకటించారు.. ఇప్పుడు సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.. దీనిపై చాలామంది బన్నీ ఫ్యాన్స్ సుకుమార్ పై ఫైర్ అవుతున్నారు.. తాజాగా ఓ ఫ్యాన్ ఏకంగా కోర్టులో కేసు పెడతానని ట్వీట్ చేశాడు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది..
టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.. మొదటి పార్ట్ గా వచ్చిన పుష్ప భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు పార్ట్ తెరకేక్కుతుంది.. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్, సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. ఏడాదిగా ఈ సినిమా షూటింగ్ జరుగుతూనే ఉంది. రీసెంట్ గా మ్యాజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తూ రిలీజ్ చేసిన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి.. పుష్ప టైటిల్ సాంగ్ మాత్రం ఓ రేంజులో చక్కర్లు కొడుతుంది..
ఇప్పటివరకు వచ్చిన ప్రతి అప్డేట్ సినిమా పై భారీ హైప్ ను క్రియేట్ చేశాయి.. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊరమాస్ లుక్ లో కనిపించబోతున్నాడు.. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ముందుగా ఆగస్టు 15 న సినిమాని రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. మరో రెండు నెలల్లో రిలీజ్ కావాల్సినా పుష్ప-2 ఊహించని విధంగా వాయిదా పడింది. ఈ విషయాన్ని సోమవారం అధికారికంగా మేకర్స్ ప్రకటించారు.. అయితే డీసెంబర్ 6 కు వాయిదా అయినట్లు ప్రకటించారు..ఈ విషయాన్ని అల్లు అర్జున్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు.. దానికి ఓ ఫ్యాన్ రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..పుష్ప-2 సినిమాను వెంటనే విడుదల చేయాలని కమ్యూనిటీ తరపున కోర్టులో కేసు వేస్తా అంటూ ఐకాన్ స్టార్ పోస్ట్‌కు రిప్లై ఇచ్చాడు.. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్ గా మారింది..
The movie was releasing in June 2024. Why this has been shifted to Dec 2024.
Is this a joke to the filmmakers. Playing with the emotions of audience.
On behalf of Puspha Community i will file a case in Court to release it ASAP
— GlobalGlimpses✨ (@krunchi_hu) June 17, 2024