Venuswamy: ఆర్పీ చెప్పింది నిజమే.. పబ్ లో వేణుస్వామి అలాంటి చేష్టలు..

Venuswamy.. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి పై జబర్దస్త్ కమెడియన్ కిర్రాక్ ఆర్పీ మొన్న భారీ స్థాయిలో కామెంట్లు చేసిన విషయం తెలిసిందే.. అతడికి జాతకం చెప్పడం రాదు అని.. ఉదయాన్నే లేచి ఫుల్లుగా రెడీ అయ్యి.. సెలబ్రిటీలు ఏ పబ్ కి వెళ్తారో తెలుసుకొని మరీ అక్కడికి వెళ్లి వారి రహస్యాలను తెలుసుకొని.. పబ్లిక్ గా ప్రకటిస్తూ.. తాను జోస్యం చెబుతున్నానని.. కచ్చితంగా జరుగుతుందని బిల్డప్ కొడతారు అంటూ కామెంట్లు చేశారు.. అయితే ఈ విషయంపై కొంతమంది ఆర్పీ ను విమర్శించిన విషయం తెలిసిందే.. కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే ఆర్పీ చెప్పింది నిజమే అని చెప్పక మానరు..మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..

పబ్ లో పట్టుబడ్డ వేణు స్వామి..

Venuswamy: What RP said is true..Venuswamy did such antics in the pub..
Venuswamy: What RP said is true..Venuswamy did such antics in the pub..

సినీ సెలబ్రిటీల, రాజకీయ నాయకుల జాతకాలు చెప్పే వేణు స్వామి పరిస్థితి ప్రస్తుతం గందరగోళంగా మారింది.. ఆయన చెప్పిన జోస్యాలు ఈసారి తలకిందులు కావడంతో సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ ఎదుర్కొన్న విషయం తెలిసిందే.. అయితే తనకు ఎదురైన పరిస్థితులను తట్టుకోవడానికి ఇటీవల పబ్ లో కనిపించి మరొకసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు..అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వరకు ఆయన చెప్పిన అంచనాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. రేవంత్ రెడ్డికి రాజయోగం లేదు.. కేసీఆర్ మళ్ళీ సీఎం అవుతాడని బల్ల గుద్ది చెప్పారు.. కానీ రేవంత్ రెడ్డి ఊహించని విధంగా అక్కడ సీఎం పదవిని చేపట్టారు ..ఇక్కడ వైఎస్ జగన్ కు ఎదురు లేదు అన్నాడు.. కానీ కూటమి విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆయన చెప్పిన రెండు జోస్యాలు ఫ్లాప్ గా మారాయి.. దాంతో ఆయనకు ఉన్న అంతో ఇంతో క్రేజ్ కూడా పోయింది. ఇదిలా ఉండగా తాజాగా ఆదివారం రోజున వేణు స్వామి చక్కగా ముస్తాబయి.. పసుపు కలర్ దుస్తులు ధరించి.. కళ్లకు గాగుల్స్ పెట్టుకొని దర్శనమిచ్చాడు.. అయితే పబ్బులో ఇలా కనిపించేసరికి వెంటనే అక్కడున్న వ్యక్తులు ఫోటోలను క్లిక్ మనిపించి.. సోషల్ మీడియాలో, వాట్స్అప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ గా మారాయి.. దీంతో ఇవి చూసిన నెటిజెన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు ..

ఆర్పీ చెప్పిన మాట నిజమయింది..

జ్యోతిష్యం చెప్పే ఆయనకు ఇలాంటి వేషాలు అవసరమా? చడీచప్పుడు కాకుండా తన పని తాను చేసుకుంటే అయిపోయేది.. ఇలా రెస్టారెంట్లలో మందు కొట్టడం ఏమిటి ? ఆయన నిజ స్వరూపం ఇదేనా? అంటూ కామెంట్లు చేయగా.. మరి కొంతమంది మొన్న ఆర్పీ చేసిన కామెంట్లను గుర్తు చేస్తున్నారు.. కిర్రాక్ ఆర్పి చేసిన కామెంట్లలో ఏమాత్రం తప్పులేదు అని.. ఇతడు ఇలా పబ్బులలో తిరుగుతాడు కాబట్టే ఆర్ పి ఆ రోజు నిక్కచ్చితంగా మీడియా ముందు చెప్పాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు .. ఏది ఏమైనా వేణు స్వామి నిజ స్వరూపం ఎట్టకేలకు బయటపడిందని చెప్పవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు