Viajy Sethupathi Remuneration : మహరాజా రెమ్యూనరేషన్ ఇంతేనా ? ఊహించని ట్విస్ట్ ఇచ్చిన విజయ్ సేతుపతి

Viajy Sethupathi Remuneration : మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతికి ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలిసిందే. ఈ మల్టీ టాలెంటెడ్ తమిళ హీరోకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఇటీవల కాలంలో విలన్ గా, హీరోగా ఎలాంటి పాత్ర వచ్చినా తన నటనతో అదరగొట్టేసిన విజయ్ సేతుపతి తన తాజా చిత్రం మహారాజాకు మాత్రం షాకింగ్ రెమ్యూనరేషన్ తీసుకున్నారట. ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు సేతుపతి నుంచి ఇది ఊహించని ట్విస్ట్ అంటున్నారు. మరి ఇంతకీ విజయ్ సేతుపతి ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంత తక్కువ పారితోషికమా ?

ప్రస్తుతం మిడ్ రేంజ్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళు కూడా కనీసం మార్కెట్ లేకపోయినా 20 నుంచి 25 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక మంచి డిమాండ్ ఉన్న హీరోలు కనీసం 50 కోట్లు పారితోషకంగా ఇవ్వకపోతే సినిమాలు చేయట్లేదు. వరస డిజాస్టర్లు అందుకున్న హీరోలు కూడా ఇటీవల కాలంలో రెమ్యూనరేషన్ విషయంలో తగ్గకపోవడంతో కొన్ని సినిమాలు ఆగిపోయాయి అన్న వార్తలు టాలీవుడ్లో షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి తెలిస్తే నోరు వెళ్ళబెట్టాల్సిందే. టాలెంట్ తో పాటు భారీ ఫాలోయింగ్ ఉన్న ఈ స్టార్ హీరో నటించిన మహారాజా మూవీ జూన్ 14న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే.

Vijay Sethupathi's 'Maharaja' releases on Friday: Plot, cast, runtime

- Advertisement -

మంచి పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. నాలుగు రోజుల్లోనే 40 కోట్లు కాబట్టి విజయ్ సేతుపతి బాక్స్ ఆఫీసు స్టామినా ఏంటో నిరూపించింది ఈ మూవీ. మరో వారం కలెక్షన్స్ జోరు ఇలాగే ఉంటే విజయ్ సేతుపతి కెరీర్లోనే మహారాజా భారీ కలెక్షన్స్ కొల్లగొట్టిన మూవీగా హిస్టరీని క్రియేట్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన మహారాజా మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కోసం విజయ్ సేతుపతి కేవలం 20 కోట్లు మాత్రమే పారితోషకంగా అందుకున్నాడట. దీంతో ఆయన అభిమానులు షాక్ అవుతున్నారు.

విలన్ గా 25 కోట్లు…

మహారాజ మూవీ ప్రమోషన్స్ లో విజయ్ సేతుపతి ఇకపై మల్టీస్టారర్ సినిమాలు చేయను అని స్టేట్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు వరకు విజయ్ సేతుపతి పలువురు బడా హీరోల సినిమాల్లో విలన్ గా, అతిథి పాత్రల్లో నటించి మెప్పించారు. అందులో ఆయన చివరగా విలన్ గా నటించిన మూవీ జవాన్. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్ర కోసం విజయ్ సేతుపతి 25 కోట్లు రెమ్యూనరేషన్ గా అందుకున్నారని తెలుస్తోంది. మరి విలన్ గానే 25 కోట్లు పారితోషకంగా తీసుకుంటే హీరోగా అంతకు డబుల్ తీసుకోవాలి. కానీ విజయ్ సేతుపతి మాత్రం మహారాజ మూవీకి కేవలం 20 కోట్లే రెమ్యూనరేషన్ గా అందుకోవడం ఆశ్చర్యకరం. అయితే మహారాజా మూవీ పాన్ ఇండియా మూవీ కాకపోవడం వల్లే ఆయన ఇంత తక్కువ పారితోషికం తీసుకున్నారని టాక్ నడుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు