Sreeleela: ఏంటి ఇది..బాత్ రూమ్ లో రచ్చ చేస్తున్న యంగ్ బ్యూటీ !

Sreeleela: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన స్టార్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ బ్యూటీ పెళ్లి సందడి సినిమాతో సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ శ్రీలీలకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి ఇండస్ట్రీలో అగ్ర హీరోయిన్ గా నిలిచింది. రవితేజ సరసన ధమాకా సినిమాలో నటించి మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత స్కంధ, భగవంత్ కేసరి, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ వంటి సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ రాలేదు. వరుస పరాజయాలను చవిచూసిన శ్రీ లీల సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చి మంచి హిట్ కోసం విపరీతంగా ప్రయత్నాలు చేసింది. ప్రస్తుతం రవితేజ సరసన హీరోయిన్గా మరో సినిమాలో నటించబోతోంది.


ఇదిలా ఉండగా….వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే శ్రీలీల సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు వరుస ఫోటోషూట్లు షేర్ చేస్తూ ఆ ఫోటోలను తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా శ్రీ లీల బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి బాత్రూమ్ లో హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ బాత్రూంలో ఫోటోలు దిగడం ఏంటని పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు