OTT Movie : భార్యకు తెలీకుండా ఆమె బెస్ట్ ఫ్రెండ్ తో భర్త ఎఫైర్… తరువాత దిమ్మతిరిగే ట్విస్ట్

OTT Movie : పెళ్లయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడం వల్ల ఎలాంటి చిక్కులు ఎదురవుతాయో తెలిపే కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమా ఈరోజు మన మూవీ సజెషన్. సాధారణంగా ఇలాంటి సినిమాలు ఇప్పటి దాకా ఎన్నో చూసాము. కానీ తను ఎంతగానో నమ్మే తన బెస్ట్ ఫ్రెండ్, సర్వస్వం అనుకునే భర్త ఇద్దరూ కలిసి భార్యను మోసం చేస్తే ఏం జరిగింది అనేదే ఈ మూవీ స్టోరీ. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? టైటిల్ ఏంటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న మూవీ క్రైమ్ థ్రిల్లర్ జానర్ కు సంబంధించింది. ఈ మూవీ పేరు ది వీకెండ్ ఎవే. సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉండి ఆసక్తికరంగా నడుస్తుంది. థ్రిల్లర్ మూవీ లవర్స్ కి కచ్చితంగా నచ్చే మూవీ అవుతుంది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

The Weekend Away – comepiaceavoi

- Advertisement -

కథలోకి వెళ్తే…

బెత్, కేట్ అనే ఇద్దరు అమ్మాయిలు బెస్ట్ ఫ్రెండ్స్. బెట్ రాబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాలో ఉంటుంది. ఈ జంటకు ఒక పాప కూడా ఉంటుంది. అయితే తన బెస్ట్ ఫ్రెండ్ కేట్ ను కలవడానికి బెత్ అమెరికా నుంచి క్రెషియా వెళ్తుంది. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అక్కడ ఉండగానే కేట్ కు ఫోన్ రావడంతో ఆమె, గొడవ పడుతూ కన్పిస్తుంది. మాట్లాడడం పూర్తి చేసి, బెత్ దగ్గరకు తిరిగొచ్చి తన మాజీ భర్త ఫోన్ చేశాడు. మూడ్ మొత్త స్పాయిల్ అయ్యింది. బార్ కి వెళ్దాం అంటూ బెత్ దగ్గర బాధ పడుతుంది. తరువాత రోజు హోటల్ రూమ్ లో లేస్తుంది బెత్. కానీ రాత్రి ఏం జరిగింది ఆమెకు అస్సలు గుర్తుండదు. పైగా కేట్ మిస్ అవుతుంది.

ఈ నేపథ్యంలోనే హోటల్ మేనేజర్ రాత్రి కేట్ ఇద్దరు అబ్బాయిలను రూమ్ కి తీసుకొచ్చింది అంటూ ఫైర్ అవుతాడు. దీంతో కేట్ ఆ అబ్బాయిలు ఎవరు ? కేట్ ఎక్కడికి వెళ్ళింది అని వెతకడం స్టార్ట్ చేస్తుంది. వాళ్ళిద్దరినీ కేట్ పేరుతో హోటల్ కు పిలిపిస్తుంది. వాళ్ళు కూడా కేట్ పిలిచింది అని నమ్మి అక్కడికి వెళతారు. మరోవైపు తనకు దొరికిన కేట్ ఫోన్ ఓపెన్ చేసి చూసిన బెత్ కు ఫ్రెండ్ తన భర్తతో ఏఫైర్ పెట్టుకుంది అనే షాకింగ్ విషయం తెలుస్తుంది. మరి ఈ విషయాన్ని బెత్ ఎలా హ్యాండిల్ చేసింది ? కేట్ ఎక్కడికి వెళ్ళిపోయింది ? ఆమె రూమ్ కి వచ్చిన ఆ ఇద్దరు అబ్బాయిలు ఎవరు ? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియాలంటే ది వీకెండ్ మూవీని చూడాల్సిందే. ముఖ్యంగా బెత్ కేట్ ను వెతుకుతున్నంతసేపు ఈ సినిమా స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు