Shivam Bhaje : శత్రు వినాశనానికి కదిలొచ్చిన శేఖరుడు! ఈసారి కంబ్యాక్ ఇచ్చేలా?

Shivam Bhaje : టాలీవుడ్ లో యాంకర్ ఓంకార్ తమ్ముడుగా ‘రాజుగారి గది’ సిరీస్ సినిమాలతో విజయాలు అందుకున్న కథానాయకుడు అశ్విన్ బాబు. ఈ హీరో కి పెద్దగా హిట్లు లేకపోయినా స్క్రిప్ట్ సెలక్షన్లలో పరిణితిని కనబరుస్తూ, యాక్టింగ్ లో కూడా నైపుణ్యం సాధిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇప్పుడు పెద్దగా సక్సెస్ లు లేకపోయినా సినిమా ఇండస్ట్రీ లలో టాలెంట్ ఉన్న వారికి ఎలాగోలా కాస్త ఎక్కువ అవకాశాలు వస్తూ ఉంటాయి. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన ‘హిడింబ’ సినిమాతో మాస్ రూటులోకి వచ్చారు అశ్విన్ బాబు. ఆ సినిమా పెద్దగా హిట్ కాకపోయినా నటుడిగా అశ్విన్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అలాగే అక్కడి నుండే మాస్ జోనర్ లో కొత్త వేరియషన్స్ తో సినిమాలు చేయడం మొదలు పెట్టాడు. ఇక ప్రస్తుతం అశ్విన్ బాబు హీరోగా రూపొందుతున్న తాజా సినిమా ‘శివం భజే’ (Shivam Bhaje). తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రమిది. గంగా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. తాజాగా ఈ సినిమా కి సంబంధించిన టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ కావడం జరిగింది.

Shivam Bhaje movie Teaser Talk

రౌద్ర రూపంలో అశ్విన్ బాబు!

ఇక తాజాగా శివమ్ భజే టీజర్ రిలీజ్ కాగా యూట్యూబ్ లో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. టీజర్ ని గమనిస్తే.. హీరోకి సడన్ గా తలనొప్పి వచ్చి, ఏం జరుగుతుందో అర్ధం కాదు. కట్ చేస్తే అఘోరాలు దర్శనమిస్తారు. తర్వాత అయ్యప్ప శర్మ పవర్ ఫుల్ వాయిస్ తో ‘ఇది శివుడే లిఖించిన శత్రు వినాశనం’ అంటూ ఓ భారీ డివైన్ యాక్షన్ సీన్ ని ప్రజెంట్ చేస్తూ టీజర్ కట్ చేశారు. అలజడి దాటి ఆలోచనలతో పదును పెడితే అంతా అర్థమౌవుతుంది శేఖరా… అంటూ అఘోర చెప్పే డైలాగ్ హీరోని ఉద్దేశించింది అని తెలుస్తుంది. ఇక టీజర్ లో టీజర్ లో యాక్షన్ ఎపిసోడ్స్ బావున్నాయి. విజువల్స్ లో క్యాలిటీ బాగా కనిపించింది. ప్రస్తుతం ఆడియన్స్ పల్స్ పట్టుకునేలానే దర్శకుడు కథని రాసుకున్నాడని టీజర్ చూస్తే అర్ధమౌతోంది. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది.

- Advertisement -

ఈ సినిమాతో కం బ్యాక్ ఇస్తాడా?

ఇక ‘శివం భజే’ టైటిల్ కొన్ని రోజుల క్రితం అనౌన్స్ చేసినప్పుడు మంచి రెస్పాన్స్ వచ్చిందని దర్శకుడు అప్సర్ సంతోషం వ్యక్తం చేశారు. లేటెస్టుగా విడుదల చేసిన హీరో అశ్విన్ బాబు ఫస్ట్ లుక్ సైతం అందర్నీ ఆకట్టుకుంటోందని ఆయన చెప్పారు. అప్పుడు ‘శివం భజే’ ఫస్ట్ లుక్ లో ఒంటి కాలి మీద నిలబడటమే కాదు, ఒంటి చేత్తో ఓ మనిషిని పైకి ఎత్తిన అశ్విన్ బాబు రౌద్ర రూరంలో కనపడతారు. అదే షాట్ టీజర్ లో గమనించవచ్చు. ఇక టీజర్ లో అఘోరాలు, త్రిశూలాలు, చీకట్లో కాగడాలు, ఇలాంటి ఎఫెక్ట్స్ బాగానే వాడారు. ఇక కథ గురించి అయితే పెద్దగా రివీల్ కాలేదని తెలుస్తూనే ఉంది. ఇక అప్సర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మహేశ్వర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. వికాస్ బాడిస మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా తో అశ్విన్ బాబు కం బ్యాక్ ఇస్తాడని తెలుస్తుంది. అయితే శివం భజే సినిమా రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. బహుశా సినిమా మాత్రం పోటీలో కాకుండా సోలో రిలీజ్ చేయడానికే మేకర్స్ ప్లాన్ లో ఉన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు